విధుల పట్ల నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు

  • రెడ్డిపల్లి పీహెచ్​సీని తనిఖీ చేసిన కలెక్టర్ 

నర్సాపూర్, వెలుగు : విధుల పట్ల నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని కలెక్టర్ ​రాహుల్​రాజ్​హెచ్చరించారు. మెదక్ జిల్లా నర్సాపూర్ మండలం రెడ్డిపల్లి ‌‌ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని మంగళవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఆస్పత్రిలో పలు  వార్డులను పరిశీలించి పేషెంట్స్ తో మాట్లాడారు. సిబ్బంది అటెండెన్స్ రిజిస్టర్​ను పరిశీలించారు. ఆస్పత్రి ఆవరణలో పరిసరాలు పరిశుభ్రంగా ఉంచుకోవాలని, రోగులకు మెరుగైన వైద్యం అందించాలని సిబ్బందికి సూచించారు.

సమగ్ర కుటుంబ సర్వేకు సిద్ధంగా ఉండాలి

మెదక్​టౌన్ : ఈ నెల 6 నుంచి జరిగే సమగ్ర కుంటుంబ సర్వేకు అధికారులు అందరూ సిద్దంగా ఉండాలని కలెక్టర్​రాహుల్​రాజ్​సూచించారు. మంగళవారం తన ఆఫీసు నుంచి టెలీకాన్ఫరెన్స్​నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్​మాట్లాడుతూ.. సర్వే పూర్తయిన తర్వాత ప్రతి ఇంటికి స్టిక్కర్​అంటించాలన్నారు. జిల్లాలో 21 మండలాలు,  2 లక్షల 13,950  ఇండ్ల సర్వే నిర్వహణకు 1,571 ఎన్యుమరేషన్ బ్లాకులు ఏర్పాటు చేసినట్లు తెలిపారు.

సర్వే నిర్వహణకు గ్రామీణ ప్రాంతాల్లో 1,468,  పట్టణ ప్రాంతంలో 256 మందితో కలిపి మొత్తం 1,724 మంది ఎన్యుమరేటర్లును నియమించినట్లు పేర్కొన్నారు.  పర్యవేక్షణకు గ్రామీణ ప్రాంతాలకు 160, పట్టణ ప్రాంతానికి 26 మంది మొత్తం 186 మందిని నియమించినట్లు చెప్పారు.