నేడు మెదక్ ​కలెక్టరేట్​లో బతుకమ్మ వేడుకలు

మెదక్​టౌన్, వెలుగు: మెదక్​ కలెక్టరేట్​లో బుధవారం బతుకమ్మ వేడుకలు నిర్వహిస్తున్నట్లు కలెక్టర్ ​రాహుల్​రాజ్​తెలిపారు. మంగళవారం కలెక్టర్​ఆఫీసులో వివిధ శాఖల అధికారులతో సమావేశం నిర్వహించారు.

ఈ సందర్భంగా కలెక్టర్​మాట్లాడుతూ.. బుధవారం కలెక్టర్ ఆఫీసు ఆవరణలో తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు అద్దం  పట్టేలా వేడుకలు నిర్వహిస్తామని తెలిపారు. ఉదయం యువజన క్రీడల శాఖ ఆధ్వర్యంలో టూ కే రన్, డీఆర్డీవో, మెప్మా ఆధ్వర్యంలో సంప్రదాయ వంటకాల ప్రదర్శన ఉంటుందన్నారు. అడిషనల్​కలెక్టర్​వెంకటేశ్వర్లు, ఆర్డీవో రమాదేవి, జడ్పీ సీఈవో ఎల్లయ్య, డీఆర్డీవో పీడీ శ్రీనివాస్​రావు, మెప్మా పీడీ ఇందిర పాల్గొన్నారు.