మెదక్ ​అభివృద్ధికి ప్రతిపాదనలు సిద్ధం చేయాలి : కలెక్టర్​ రాహుల్​రాజ్​

  • కలెక్టర్​ రాహుల్​రాజ్​

మెదక్​టౌన్, వెలుగు: మెదక్ నియోజకవర్గ అభివృద్ధికి ప్రతిపాదనలు సిద్ధం చేయాలని కలెక్టర్ రాహుల్ రాజ్ అధికారులను ఆదేశించారు. శనివారం మెదక్ ​కలెక్టర్ ఆఫీసులో వివిధ శాఖల అధికారులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. మెదక్ ఎంట్రెన్స్​లో వెల్​కమ్​ బోర్డు సరికొత్తగా తయారు చేయించాలన్నారు, యానిమల్ బర్త్ కంట్రోల్ సెంటర్స్ ఏర్పాటు, జంతు జనన నియంత్రణ చర్యలు చేపట్టాలన్నారు. మెడికల్​ కాలేజీ ప్రాంగణంలో హాస్పిటల్, స్టాఫ్ క్వార్టర్స్, సిబ్బంది వసతి గృహాల కోసం ఎస్టిమేట్స్ సిద్ధం చేయాలన్నారు.

 ఏడుపాయల ఆలయానికి సంబంధించి రోడ్డు వైడింగ్,  హోటల్ కమ్​టూరిజం గెస్ట్ హౌస్, మెయిన్ రోడ్ నుంచి టెంపుల్ వరకు సెంట్రల్ లైటింగ్  ఏర్పాటు, పార్కింగ్ స్థలాలు ఏర్పాటు చేయాలన్నారు. మెదక్ చర్చి డిసెంబర్ నాటికి వందేళ్లు పూర్తిచేసుకుంటుందని చర్చి అభివృద్ధికి ఎస్టిమేట్స్ తయారు చేయాలని అధికారులను ఆదేశించారు. సమావేశంలో జడ్పీ సీఈవో ఎల్లయ్య, డీర్డీవో పీడీ శ్రీనివాసరావు, ఆర్అండ్ బీ,  పంచాయతీరాజ్, ఇరిగేషన్, దేవాదాయ, వైద్య శాఖల అధికారులు పాల్గొన్నారు.