ఇందిరమ్మ ఇండ్ల సర్వే పారదర్శకంగా నిర్వహించాలి : కలెక్టర్​ రాహుల్​రాజ్​

పాపన్నపేట, వెలుగు: ఇందిరమ్మ ఇండ్ల సర్వే పారదర్శకంగా నిర్వహించాలని కలెక్టర్​రాహుల్​రాజ్​ అన్నారు. గురువారం పాపన్నపేట మండలం యూసుపేటలో  సర్వే  తీరును  పరిశీలించారు. ఈ సందర్భంగా కలెక్టర్​మాట్లాడుతూ..యాప్ లో ఏవైనా సమస్యలు ఏర్పడితే సంబంధిత డిస్ట్రిక్ మేనేజర్ ను సంప్రదించి నివృత్తి చేసుకొవాలని సిబ్బందికి సూచించారు. సర్వేయర్లకు ప్రజలు సంబంధిత పత్రాలు అందించి సహకరించాలన్నారు.

క్షేత్రస్థాయిలో అసలైన లబ్ధిదారులను గుర్తిస్తున్నామన్నారు. అనంతరం పోడ్చన్​పల్లి పీహెచ్​సీని తనిఖీ చేశారు. సిబ్బంది అటెండెన్స్ , రోగుల ఓపీ, మందుల స్టాక్ రిజిస్టర్లను పరిశీలించారు. గైర్హాజరైన ఉద్యోగుల గురించి జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారికి  ఫోన్ చేసి ఆరా తీశారు. నివేదికల సమర్పించాలని సూచించారు. ఆయన వెంట తహసీల్దార్​సతీశ్, ఆర్ఐ నాగరాజు, ఎంపీవో, సంబంధిత అధికారులు పాల్గొన్నారు

14న కాస్మొటిక్​ ఛార్జీల పెంపు కార్యక్రమం

మెదక్​టౌన్: ఈ నెల 14న జిల్లాలోని హాస్టళ్లు, స్కూళ్లలో డైట్, కాస్మోటిక్స్ ఛార్జీల పెంపు కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించాలని కలెక్టర్​ రాహుల్​రాజ్​సూచించారు. కలెక్టర్ ఆఫీసులో అడిషనల్​ కలెక్టర్​నగేశ్, డీఈవో రాధాకిషన్​తో కలిసి అధికారులతో సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. కార్యక్రమంలో భాగంగా జిల్లాకు చెందిన మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలు, సంక్షేమ వసతి గృహాలు, స్టూడెంట్స్, వారి​తల్లిదండ్రులతో కలిసి భోజనం చేస్తారన్నారు.

జిల్లాలోని అన్ని రెసిడెన్షియల్ స్కూళ్లు, హాస్టళ్లలో కంప్లయింట్ బాక్స్​లను ఏర్పాటు చేయాలన్నారు. సమావేశంలో ట్రైబల్​వెల్ఫేర్​డీడీ నీలిమ, బీసీ సంక్షేమాధికారి జగదీశ్,  మైనార్టీ సంక్షేమ అధికారి జెమ్లానాయక్​,  ఎస్సీ సంక్షేమ అధికారి శశికళ,  బీసీ సంక్షేమ, మైనారిటీ స్కూళ్ల ప్రిన్సిపాల్స్, వసతి గృహాల వార్డెన్లు, ఎంఈవోలు, హెడ్మాస్టర్లు పాల్గొన్నారు.