చదువుతోనే ఎదుగుతాం : కలెక్టర్ మనుచౌదరి

బెజ్జంకి, వెలుగు : స్టూడెంట్స్ చదువుతూనే ఉన్నత స్థాయికి ఎదుగుతారని కలెక్టర్ మనుచౌదరి అన్నారు. సోమవారం మండల కేంద్రంలోని కస్తూర్బా స్కూల్​స్టూడెంట్స్​తో మాట్లాడి సమస్యల గురించి ఆరా తీశారు. ఈ సందర్భంగా కలెక్టర్​మాట్లాడుతూ ఇంగ్లీష్​లో మాట్లాడడం అలవాటు చేసుకోవాలని, టెన్త్​లో మంచి జీపీఏ రావడానికి పట్టుదలతో చదవాలని సూచించారు. రోజువారీ భోజనం రుచికరంగా అందిస్తున్నారా లేదా తెలుసుకున్నారు. 

స్కూల్​లో లైబ్రరీ, కంప్యూటర్లు ఏర్పాటు చేయాలని స్టూడెంట్స్​ కలెక్టర్ కు విన్నవించగా స్వచ్ఛంద సంస్థ ద్వారా ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారు. వంటగది, పిల్లల డార్మెటరీలను చెక్​చేశారు. అంతకుముందు ఎంపీడీవో ఆఫీసులోకుటుంబ సమగ్ర సర్వే  డేటా ఎంట్రీని పరిశీలించారు. ఆయన వెంట ఎంపీడీవో ప్రవీణ్, ఎంఈవో మహతి లక్ష్మి, ఎంపీ వో మంజుల, శ్వేత పాల్గొన్నారు.

పది రోజుల్లో కొనుగోళ్లు కంప్లీట్​ చేయాలి

కోహెడ : పది రోజుల్లో ధాన్యం కొనుగోళ్లు కంప్లీట్​చేయాలని కలెక్టర్​మనుచౌదరి అధికారులను ఆదేశించారు. మండలంలోని శనిగరం ఐకేపీ కొనుగోలు కేంద్రాన్ని విజిట్ చేశారు. ఈ సందర్భంగా రికార్డులను పరిశీలించి ఇప్పటి వరకు ఎంత ధాన్యం కొనుగోలు చేశారని ప్రశ్నించారు. ధాన్యం కొనుగోళ్లు స్పీడప్​ చేయాలని సూచించారు. అనంతరం బీసీ హాస్టల్​ను విజిట్​చేసి సమస్యలు తెలుసుకున్నారు. కలెక్టర్​వెంట డీఆర్డీవో జయదేవ్​ఆర్య, తహసీల్దార్​ సురేఖ, ఎంపీడీవో కృష్ణయ్య, ఏపీఎం తిరుపతి, ఆర్ఐ ఎల్లయ్య ఉన్నారు.