సిద్దిపేట రూరల్, వెలుగు: ప్రజా పాలన సేవా కేంద్రాలను ఉపయోగించుకోవాలని కలెక్టర్ మను చౌదరి తెలిపారు. బుధవారం ఆయన సిద్దిపేట రూరల్ ఎంపీడీఓ ఆఫీస్‌ను ఆకస్మికంగా తనిఖీ చేశారు. ప్రజా పాలన సేవ కేంద్రం వద్ద ఎలాంటి ఫ్లెక్సీ పెట్టకపోవడంతో ఎంపీడీవో రాఘవేందర్ రెడ్డి పై కలెక్టర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. వెంటనే బ్యానర్ ఏర్పాటు చేయాలని ఆదేశించారు.
గృహ జ్యోతి, మహాలక్ష్మి పథకాలకు సంబంధించి దరఖాస్తుదారులకు లబ్ధి చేకూరేలా చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులకు ఆదేశించారు. అనంతరం బాల సదనం, సఖి కేంద్రం, భరోసా కేంద్రాలను సందర్శించారు. ఆ తర్వాత సిద్దిపేట జిల్లా ఎస్బీఐ వ్యవసాయ వాణిజ్య బ్యాంకు, యూనియన్ బ్యాంకులను సందర్శించారు. రైతు రుణమాఫీ, పంట రుణాల రీ షెడ్యూల్ ను పరిశీలించారు.
రుణమాఫీ అందజేయడం లో రైతులకు ఎలాంటి ఇబ్బందులూ ఉండకుందని బ్యాంక్ అధికారులకు సూచించారు. ఈ కార్యక్రమంలో యూనియన్ బ్యాంక్ ఆర్ ఏం వికాస్, ఎస్బిఐ చీఫ్ మేనేజర్లు జయంతి కిషోర్, సుధీర్, అగ్రికల్చర్ రిసోర్సింగ్ మేనేజర్ నర్రా సంతోష్ చందర్, నిష్కల్ తదితరులు పాల్గొన్నారు..