పేదల జీవితాల్లో వెలుగులు నింపాలి : కలెక్టర్ మనుచౌదరి

  • కలెక్టర్ మనుచౌదరి 

సిద్దిపేట రూరల్, వెలుగు: పేదల జీవితాల్లో వెలుగులు నింపేలా శిక్షణ ఉండాలని కలెక్టర్ మను చౌదరి అన్నారు. గురువారం జిల్లా కేంద్రంలోని గ్రామీణ స్వయం ఉపాధి శిక్షణ సంస్థను ఆయన సందర్శించారు. కలెక్టర్ ​మాట్లాడుతూ 30 రోజులు నిబద్ధతతో నేర్చుకుంటే ఆ రంగంలో ఉపాధి పొందవచ్చన్నారు. అనంతరం సిద్దిపేట అర్బన్ మండలంలో  మిట్టపల్లి గ్రామ పరిధిలో ఉన్న తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకుల బాలికల స్కూల్ ను సందర్శించి, స్టూడెంట్స్ తోమాట్లాడి వారి సమస్యలను తెలుసుకున్నారు.

 స్కూల్ లో నెలకొన్న సమస్యలను ప్రిన్సిపాల్ లక్ష్మాంజలిదేవి కలెక్టర్ కు తెలుపగా వాటికి త్వరగా అప్రూవల్ అందజేస్తానన్నారు. జిల్లా కేంద్రంలోని ఎస్సీ హాస్టల్ ను సందర్శించి, స్టూడెంట్స్​సమస్యలను తెలుసుకుని వాటిని పరిష్కరిస్తామని హామీ
 ఇచ్చారు.