అర్హులందరికీ ఇందిరమ్మ ఇండ్లు : కలెక్టర్ ​క్రాంతి

  • రోడ్డు నిబంధనలు పాటించాలి

సంగారెడ్డి టౌన్, వెలుగు: ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారుల ఎంపికలో రెవెన్యూ అధికారులు పారదర్శకంగా వ్యవహరించాలని కలెక్టర్​క్రాంతి సూచించారు. మంగళవారం సంగారెడ్డి కలెక్టరేట్​లోజిల్లాలోని ఆర్డీవోలు, తహసీల్దార్లు, ఎంపీడీవోలు, ప్రత్యేక అధికారులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్​మాట్లాడుతూ.. ఇందిరమ్మ ఇండ్ల విషయంలో అధికారులు వచ్చిన దరఖాస్తులను పరిశీలించి, గ్రామ సభల్లో చర్చించి లబ్ధిదారులను ఎంపిక చేయాలని ఆదేశించారు. ఇందిరమ్మ  ఇండ్ల సర్వేలో పెండింగ్ ఉన్న వాటిని, గ్రామాల్లో లేని వారిని పిలిపించి వివరాలు సేకరించి సర్వే పూర్తి చేయాలన్నారు. జిల్లాలోని కొల్లూరు, తెల్లాపూర్ లో నిర్మాణం పూర్తయిన డబుల్ బెడ్ రూమ్ ఇండ్లను లబ్ధిదారులకు అందజేయాలన్నారు. 

అక్కడ అంగన్వాడీ కేంద్రాలు, అమ్మ ఆదర్శ స్కూళ్లు ఏర్పాటు చేయడానికి చర్యలు తీసుకోవాలన్నారు. అసంపూర్తిగా ఉన్న ఇండ్ల నిర్మాణాల గురించి లబ్ధిదారులతో చర్చించి ఇందిరమ్మ ఇండ్ల కింద బదిలీ చేసేందుకు అవసరమైన చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు. మౌలిక వసతుల కల్పనకు అధికారులు సమన్వయంతో పని చేయాలన్నారు. సమావేశంలో అడిషనల్​కలెక్టర్లు మాధురి, చంద్రశేఖర్, హౌసింగ్ పీడీ చలపతి, తహసీల్దార్లు, ఎంపీడీవోలు, మండల ప్రత్యేక అధికారులు, కాంట్రాక్టర్లు పాల్గొన్నారు.

రోడ్డు భద్రతా నిబంధనలు పాటించాలి

మెదక్​ టౌన్: ప్రతి ఒక్కరూ రోడ్డు భద్రతా నిబంధనలు పాటించాలని కలెక్టర్​రాహుల్​రాజ్, ఎస్పీ ఉదయ్​కుమార్​రెడ్డి సూచించారు. మంగళవారం మెదక్​కలెక్టరేట్ లో రోడ్డు భద్రతా కమిటీ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. రోడ్డు ప్రమాదాలను నివారించేందుకు అధికారులు పకడ్బందీ చర్యలు చేపట్టాలని ఆదేశించారు. వాహనదారులు రోడ్డు భద్రతా నియమాలు పాటించి డ్రైవింగ్​చేయాలన్నారు. 

పోలీస్, నేషనల్ హైవే, మున్సిపల్ అధికారులు జాయింట్ ఇన్స్ పెక్షన్​ ద్వారా తరచూ ప్రమాదాలు జరుగుతున్న ప్రాంతాలను గుర్తించి నివారణకు కృషి చేయాల్సిందిగా సూచించారు. ఎస్పీ మాట్లాడుతూ.. రోడ్డు ప్రమాదాల నివారణకు పోలీస్ యంత్రాంగం కృషి చేస్తుందన్నారు. డ్రంకెన్​డ్రైవ్​తనిఖీలు నిర్వహించి ప్రజల్లో చైతన్యం వచ్చే విధంగా చర్యలు తీసుకుంటున్నామన్నారు. సమావేశంలో ఆర్అండ్ బీ ఈఈ సర్దార్ సింగ్, డీఎంహెచ్​వో శ్రీరామ్, డీటీవో వెంకటస్వామి, మున్సిపల్ కమిషనర్ శ్రీనివాస్ రెడ్డి, ఇతర శాఖల అధికారులు పాల్గొన్నారు. 

జిల్లాను ప్రథమ స్థానం నిలపాలి 

మెదక్​ జిల్లాను అన్ని రంగాల్లో ప్రథమ స్థానంలో నిలపాలని, ధరణి పెండింగ్ దరఖాస్తులను వేగంగా పరిష్కరించాలని కలెక్టర్​రాహుల్​రాజ్​అధికారులకు సూచించారు. మెదక్​కలెక్టరేట్ లో రెవెన్యూ పారదర్శక పాలన, ధరణి, ల్యాండ్, కోర్టు కేసులు, ప్రజావాణి పెండింగ్ దరఖాస్తులు, ఫారెస్ట్ భూసమస్యలపై జిల్లాలోని తహసీల్దార్లతో సమావేశం నిర్వహించారు. 

ఈ సందర్భంగా కలెక్టర్​ మాట్లాడుతూ.. ఆర్డీవోలు, తహసీల్దార్ స్థాయిలో పెండింగ్​లో  ఉన్న దరణి దరఖాస్తులను వెంటనే పరిష్కరించాలన్నారు. కార్యక్రమంలో అడిషనల్​ కలెక్టర్​నగేశ్, డీఆర్​వో భుజంగరావు, మెదక్​, నర్సాపూర్, తూప్రాన్​ఆర్డీవోలు రమాదేవి, మహిపాల్ రెడ్డి, జయచంద్రారెడ్డి, తహసీల్దార్లు, అధికారులు పాల్గొన్నారు.