భోజనం క్వాలిటీ తగ్గితే కఠిన చర్యలు : కలెక్టర్ క్రాంతి

జోగిపేట, వెలుగు: స్టూడెంట్స్​కు పెట్టే భోజనంలో క్వాలిటీ తగ్గితే కఠిన చర్యలు తీసుకుంటామని కలెక్టర్​క్రాంతి హెచ్చరించారు. గురువారం  జోగిపేటలోని  మైనార్టీ గురుకుల స్కూల్​ను ఆమె తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ​మాట్లాడుతూ..  గురుకులాలు, సంక్షే మ హాస్టళ్లలో కొత్త మెనూ ప్రకారం భోజనం పెట్టాలన్నారు. అనంతరం స్టూడెంట్స్​తో కలిసి భోజనం చేశారు. స్కూల్​పరిసరాలను పరిశీలించి, వంటగది, సరుకులను చెక్​చేశారు.  ఆందోల్ శివారులోని  ఓ ఫంక్షన్ హాల్ లో అంగన్వాడీ టీచర్ల మేళాను ప్రారంభించి టీచర్లకు దిశానిర్దేశం చేశారు. 

 సంగుపేట, చౌటుకూర్ లో జరుగుతున్న ఇందిరమ్మ ఇళ్ల సర్వే ప్రక్రియను పరిశీలించారు. రోజుకు ఎన్ని కుటుంబాల వివరాలు నమోదు చేస్తున్నారు,  ఏమైనా ఇబ్బందులు ఎదురవుతున్నాయా అని సర్వేయర్లను అడిగి తెలుసుకున్నారు. పొరపాట్లకు తావులేకుండా వివరాలను మొబైల్ యాప్ లో నమోదు చేయాలని ఆదేశించారు. కార్యక్రమంలో ఆర్డీవో పాండు, మండల ప్రత్యేకాధికారి గీత, ఎంపీడీవో రాజేశ్, ఎంఈవో కృష్ణ, ఇన్​చార్జి ప్రిన్సిపాల్​సౌజన్య, టీచర్లు పాల్గొన్నారు.