అర్జీలను పెండింగ్​లో పెట్టొద్దు : కలెక్టర్ ​క్రాంతి

సంగారెడ్డి టౌన్, వెలుగు: ప్రజావాణికి వచ్చిన అర్జీలను పెండింగ్​లో పెట్టొద్దని కలెక్టర్​క్రాంతి అధికారులను ఆదేశించారు. సోమవారం సంగారెడ్డి కలెక్టరేట్​లో అడిషనల్​కలెక్టర్లు చంద్రశేఖర్, మాధురి, ట్రైనీ కలెక్టర్ మనోజ్, డీఆర్​వో పద్మజా రాణి, ఆర్డీవో రవీందర్ రెడ్డితో కలిసి వినతులు స్వీకరించారు. ఈ సందర్భంగా కలెక్టర్​మాట్లాడుతూ.. ప్రజావాణికి మొత్తం 74 ఫిర్యాదులు వచ్చినట్లు తెలిపారు. 

అనంతరం సంగారెడ్డి మండలం  పసల్వాదిలోని సర్వే నంబర్ 599 లో అప్పటి ప్రభుత్వం దళితులకు భూములు కేటాయిస్తే నేటి పాలకులు వాటిని స్వాధీనం చేసుకునేందుకు ప్రయత్నిస్తున్నారని అంబేద్కర్ సేవా సమితి రాష్ట్ర అధ్యక్షుడు జగన్, అశోక్ బాధితులతో కలిసి కలెక్టర్​కు విజ్ఞప్తి చేశారు. కార్యక్రమంలో వివిధ శాఖల అధికారులుపాల్గొన్నారు.

సమస్యలను ఎప్పటికప్పుడు పరిష్కరించాలి

మెదక్​ టౌన్: ప్రజావాణి సమస్యలను ఎప్పటికప్పుడు పరిష్కరించాలని అడిషనల్​కలెక్టర్​నగేశ్​అధికారులను ఆదేశించారు. మెదక్​కలెక్టరేట్​లో ప్రజావాణి కార్యక్రమంలో భాగంగా డీఆర్​వో భుజంగరావు, జడ్పీ సీఈవో ఎల్లయ్య, డీఆర్డీవో పీడీ శ్రీనివాస్​రావుతో కలిసి ప్రజల నుంచి వినతులు స్వీకరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రజావాణికి మొత్తం 53 దరఖాస్తులు వచ్చినట్లు తెలిపారు. ఇందులో డబుల్ బెడ్​రూమ్​6,  ధరణి- 23, పింఛన్లు 2, ఇతర సమస్యలు-22 ఉన్నాయన్నారు. జిల్లా స్థాయి అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. 

ప్రతి రెండో మంగళవారం దివ్యాంగుల ప్రజావాణి

దివ్యాంగుల సమస్యలపై ప్రత్యేక దృష్టి పెట్టినట్లు కలెక్టర్​రాహుల్​రాజ్​తెలిపారు. సోమవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ..ప్రతి నెలా రెండో మంగళవారం దివ్యాంగుల కోసం ప్రత్యేక ప్రజావాణి నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు. అంతర్జాతీయ దివ్యాంగుల దినోత్సవం రోజు ఇచ్చిన మాటకు కట్టుబడి ఉంటామన్నారు. ఈ నెల10న మెదక్​కలెక్టరేట్​లో మొదటి ప్రజావాణి నిర్వహిస్తున్నట్లు వెల్లడించారు. అందుకు అవసరమైన ఏర్పాట్లు చేయాలని జిల్లా సంక్షేమాధికారిని ఆదేశించారు.