ధాన్యం కొనుగోలు స్పీడప్​ చేయాలి : కలెక్టర్ ​క్రాంతి

  • కలెక్టర్ క్రాంతి 

సంగారెడ్డి, వెలుగు: జిల్లాలో ధాన్యం కొనుగోలు స్పీడప్​చేయాలని కలెక్టర్ ​క్రాంతి అధికారులను ఆదేశించారు. శుక్రవారం జిల్లాలోని చౌటకూర్ తో పాటు కొర్పోల్ గ్రామంలో సమగ్ర కుటుంబ సర్వే, ధాన్యం కొనుగోలు కేంద్రాలను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ... జిల్లాలో సమగ్ర సర్వే ఎలాంటి అవంతరాలు లేకుండా సాఫీగా కొనసాగుతుందన్నారు. సేకరించిన సమాచారాన్ని ఎప్పటికప్పుడు ఆన్ లైన్ లో చేపడుతున్నామన్నారు. ధాన్యం కొనుగోలు కేంద్రాల వద్ద కనీస సౌకర్యాలు కల్పిస్తున్నరా లేదా అని రైతులను అడిగి తెలుసుకున్నారు. ఇప్పటి వరకు కొనుగోలు చేసిన ధాన్యం రికార్డులను పరిశీలించారు. కార్యక్రమంలో మండల స్పెషల్ ఆఫీసర్ బాలరాజు, తహసీల్దార్ కిరణ్ కుమార్, ఎంపీవో శ్రీకాంత్ ఉన్నారు.

 పథకాలను సద్వినియోగం చేసుకోవాలి

గిరిజనులు ప్రభుత్వ పథకాలను సద్వినియోగం చేసుకొని జీవన ప్రమాణాలు పెంచుకోవాలని కలెక్టర్ క్రాంతి సూచించారు. సంగారెడ్డి కలెక్టర్ ఆఫీసులో బిర్సా ముండా జయంతి సందర్భంగా గిరిజన గౌరవ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ..గిరిజనుల ఆర్థిక, సామాజిక సమస్యలను పరిష్కరించేందుకు బిర్సా ముండా ఎంతో కృషి చేశారన్నారు. గిరిజనుల సంక్షేమానికి ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాల గురించి విస్తృత ప్రచారం చేయాలని అధికారులకు సూచించారు. బిర్సా ముండా వంటి మహా నాయకుల జీవితాలు ప్రతి ఒక్కరికీ మార్గదర్శకంగా  నిలుస్తాయని తెలిపారు.