లింగ నిర్ధారణ పరీక్షలు చేయొద్దు : కోయ శ్రీహర్ష

నారాయణపేట, వెలుగు: జిల్లాలో లింగ నిర్ధారణ పరీక్షలు చేసినట్లు రుజువైతే చట్టరీత్యా చర్యలు తప్పవని కలెక్టర్  కోయ శ్రీహర్ష హెచ్చరించారు.  మంగళవారం కలెక్టరేట్ లోని వీడియో కాన్ఫరెన్స్ హాల్ లో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్  మాట్లాడుతూ జిల్లాలోని ప్రైవేట్ ఆసుపత్రుల్లో జరిగిన సాధారణ కాన్పులు, సిజేరియన్​ ఆపరేషన్ల వివరాలు అందించాలని ఆదేశించారు. స్కానింగ్  సెంటర్ల వివరాలు, చేసిన స్కానింగ్  వివరాలు తెలియజేయాలన్నారు. డీఎంహెచ్​వో సౌభాగ్య లక్ష్మి, డిప్యూటీ డీఎంహెచ్ వో శైలజ, డీఎంవో అశోక్ కుమార్  పాల్గొన్నారు.