శిక్షణ కు మారుపేరు స్కౌట్స్ అండ్ గైడ్స్ : జి.రవినాయక్

మహబూబ్ నగర్ కలెక్టరేట్, వెలుగు: శిక్షణకు మారు పేరు స్కౌట్స్ అండ్ గైడ్స్ అని కలెక్టర్ జి.రవినాయక్ అన్నారు. గురువారం జిల్లా కేంద్రంలో  స్కౌట్స్ అండ్ గైడ్స్ లీడర్స్ శిక్షణ ముగింపు కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. ఫిబ్రవరి 11న స్కౌట్స్ అండ్ గైడ్స్ వ్యవస్ధాపకుడు లార్డ్ బెడెన్ పావెల్ జన్మదినం సందర్భంగా ఆయనకు నివాళిఅర్పించారు.  శిక్షణ కార్యక్రమంలో నేర్చుకున్న అనుభవాలు, శిక్షకుల సూచనలు పాటించాలన్నారు. ఎన్ సీసీ, ఎన్ఎస్ఎస్, స్కౌట్ అండ్ గైడ్స్ లాంటి సంస్ధల శిక్షణ కార్యక్రమం   ఉపయోగపడుతుందన్నారు .