స్ట్రాంగ్ రూంను పరిశీలించిన కలెక్టర్

మహబూబ్ నగర్ కలెక్టరేట్, వెలుగు : మహబూబ్ నగర్  ఎమ్మెల్సీ ఉప ఎన్నిక కౌంటింగ్ ఏప్రిల్​ 2న జిల్లా కేంద్రంలోని బాయ్స్  కాలేజీలో జరుగనుండగా, కౌంటింగ్ ఏర్పాట్లను బుధవారం ఎన్నికల రిటర్నింగ్ అధికారి, కలెక్టర్  జి.రవినాయక్  పరిశీలించారు. స్ట్రాంగ్ రూం, కౌంటింగ్ హాల్​లో చేయాల్సిన ఏర్పాట్లను పరిశీలించి వివరాలు అడిగి తెలుసుకున్నారు.

కౌంటింగ్  ఏజెంట్లు, సిబ్బంది కోసం ప్రత్యేక దారి, బారికేడింగ్ పై  పంచాయతీ రాజ్  అధికారులకు పలు సూచనలు చేశారు. పోలింగ్  అనంతరం బ్యాలెట్  బాక్స్, పోలింగ్  సామాగ్రిని అందజేసేందుకు రిసెన్షన్  కేంద్రంలో కౌంటర్ల ఏర్పాటుపై ఆర్డీవోకు పలు సూచనలు చేశారు. పీఆర్  ఈఈ నరేందర్ రెడ్డి, ఆర్డీవో నవీన్  ఉన్నారు.