స్టాప్ డయేరియా క్యాంపెయిన్ ప్రారంభం : బోయి విజయేంద్ర

మహబూబ్ నగర్ కలెక్టరేట్, వెలుగు: ఐదేళ్లలోపు పిల్లలు డయేరియా బారిన పడకుండా ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవాలని  కలెక్టర్ బోయి విజయేంద్ర సూచించారు. మహబూబ్ నగర్​లోని రామయ్యబౌళి అర్బన్ హెల్త్ సెంటర్​లో స్టాప్ డయేరియా క్యాంపెయిన్​ను మంగళవారం ప్రారంభించారు. పిల్లలకు ఓఆర్ఎస్ ప్యాకెట్లు, జింక్ సిరప్​లను కలెక్టర్ అందజేశారు.

ఐదేళ్లలోపు పిల్లల ఉన్న ఇళ్లకు వెళ్లి ఎఎన్ఎంలు, ఆశా వర్కర్స్ అవగాహన కల్పించాలన్నారు. డీఎంహెచ్​వో డాక్టర్ కృష్ణ, ఏవోడీటీ శశికాంత్, జిల్లా మలేరియా అధికారి డాక్టర్ భాస్కర్ నాయక్ తదితరులు పాల్గొన్నారు. 

మినీ శిల్పారామం సందర్శన 

జిల్లా కేంద్రంలోని ట్యాంక్ బండ్ వద్ద ఉన్న మినీ శిల్పారామాన్ని కలెక్టర్ విజయేంద్ర మంగళవారం సందర్శించారు. ట్యాంకు బండ్ అభివృద్ది పనుల పురోగతిపై సంబంధిత అధికారులు  కలెక్టర్​కు వివరించారు. ఆమె వెంట అడిషనల్ కలెక్టర్ శివేంద్రప్రతాప్,  మున్సిపల్ కమిషనర్ మహేశ్వర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.