పక్కాగా ఇందిరమ్మ ఇండ్ల సర్వే చేయాలి : కలెక్టర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ సంతోష్‌‌‌‌‌‌‌‌

కోడేరు,వెలుగు: ఇందిరమ్మ ఇళ్ల కోసం ప్రభుత్వం చేపట్టిన సర్వేను పక్కాగా నిర్వహించాలని, నిజమైన అర్హులను గుర్తించాలని నాగర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కర్నూల్‌‌‌‌‌‌‌‌ కలెక్టర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ బాదావత్‌‌‌‌‌‌‌‌ సంతోష్ ఆదేశించారు. గురువారం పెద్దకొత్తపల్లి మండలం పెద్దకార్పముల గ్రామంలో జరుగుతున్న ఇండ్ల సర్వేను కలెక్టర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ పరిశీలించారు. స్వయంగా లబ్ధిదారుల వివరాలు సేకరించారు. యాప్‌‌‌‌‌‌‌‌లో ఫొటో అప్‌‌‌‌‌‌‌‌లోడ్‌‌‌‌‌‌‌‌ విధానాన్ని పరిశీలించారు. 

సర్వేలో ఏమైనా ఇబ్బందులు ఉన్నాయా అని పంచాయతీ సెక్రటరీని అడిగారు. ప్రభుత్వ నిబంధనల మేరకు తప్పులు లేకుండా వివరాలు సేకరించాలన్నారు. సొంత స్థలం కలిగి ఉన్నారా, ప్రస్తుతం ఉంటున్న ఇంటి యజమాని ఎవరు.. తదితర వివరాలు నమోదు చేయాలని సూచించారు. కలెక్టర్ వెంట తహసీల్దార్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ జేకే మోహన్, ఎంపీడీవో నాగేంద్రం, డిప్యూటీ తహసీల్దార్ రమేశ్‌‌‌‌‌‌‌‌, ఇతర అధికారులు 
ఉన్నారు. 

ధాన్యం కొనుగోలు కేంద్రాలు పరిశీలన

 నాగర్ కర్నూల్ జిల్లా పెద్ద కొత్తపల్లి మండలంలోని దేవుని తిరుమలాపురం గ్రామంలో  గురువారం సహకార సంఘం ఆధ్వర్యంలో నెలకొల్పిన వరి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని జిల్లా కలెక్టర్  బాదావత్ సంతోష్ సందర్శించారు. రైతుల నుంచి ఇప్పటి వరకు సేకరించిన ధాన్యం నిల్వల గురించి కేంద్రాల నిర్వాహకులను అడిగి తెలుసుకున్నారు. రైతుల సౌకర్యార్థం కేంద్రంలో అందుబాటులో ఉంచిన సదుపాయాలను పరిశీలించారు. కేంద్రానికి ధాన్యం తీసుకువచ్చిన రైతులను పలకరించి, కొనుగోలు కేంద్రాల్లో ఏమైనా ఇబ్బందులు ఉన్నాయా? అని ఆరా తీశారు.  కలెక్టర్ వెంట పెద్ద కొత్తపల్లి తహసీల్దార్ జే. కే. మోహన్, డిప్యూటీ తహసీల్దార్ రమేశ్, అధికారులు ఉన్నారు.