ఎల్ఆర్ఎస్ అప్లికేషన్ల స్క్రూటినీకి స్పెషల్​ టీమ్స్

నాగర్ కర్నూల్ టౌన్, వెలుగు: జిల్లాలో నాన్  లేఅవుట్  భూముల క్రమబద్దీకరణ కోసం దరఖాస్తు చేసుకున్న వారి స్థలాలు, పత్రాలు పరిశీలించాలని కలెక్టర్  బదావత్  సంతోష్  ఆదేశించారు. బుధవారం కలెక్టరేట్  మీటింగ్ హాల్​లో అడిషనల్​ కలెక్టర్  దేవ సహాయంతో కలిసి ఎల్ఆర్ఎస్  దరఖాస్తుల కమబద్దీకరణపై రెవెన్యూ, పంచాయతీరాజ్, ఇరిగేషన్, మున్సిపల్  అధికారులకు శిక్షణ తరగతులు నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్​ మాట్లాడుతూ క్షేత్ర స్థాయిలో పర్యటించాలని, ప్రభుత్వ భూములు కాపాడాలని, దరఖాస్తులు సక్రమంగా ఉంటే రెగ్యులరైజ్  చేయాలని సూచించారు. 

ప్రజలకు ఇబ్బంది లేకుండా, ప్రభుత్వానికి నష్టం కలగకుండా రెగ్యులరైజ్  చేయాల్సిన అవసరం ఉందన్నారు. జిల్లా వ్యాప్తంగా 2020 నాటికి 67,603  దరఖాస్తులు పెండింగ్ లో ఉన్నాయని తెలిపారు. ఎల్ఆర్ఎస్  దరఖాస్తుల స్క్రూటినీని పక్కాగా నిర్వహించేందుకు అవసరమైన సపోర్ట్  సిస్టం అందిస్తామన్నారు. డీపీవో రామ్మోహన్​రావు, జిల్లా టౌన్   ప్లానింగ్  ఆఫీసర్​ శేఖర్  పాల్గొన్నారు.

మహిళలు స్వశక్తితో ఎదగాలి

పొదుపు సంఘాల ద్వారా మహిళలు స్వశక్తితో ఎదగాలని కలెక్టర్  బదావత్  సంతోష్  సూచించారు. కలెక్టరేట్ లో మహిళా శక్తి పథకం ద్వారా పాడి గేదెలు, పెరటి కోళ్ల పెంపకంపై మండల స్థాయి సెర్ప్, మెప్మా అధికారులకు అవగాహన సదస్సు నిర్వహించారు. జిల్లాలో పాడి పశువులు, పెరటి కోళ్ల పెంపకాన్ని విస్తృతంగా చేపట్టాలని, గ్రామీణ ప్రాంత మహిళలను పారిశ్రామికవేత్తలుగా తీర్చిదిద్దేందుకు అవసరమైన చర్యలు తీసుకోవాలన్నారు. 

జిల్లాలో 1,46,446, మంది సభ్యులు ఉన్నారని, ఆసక్తి ఉన్న మహిళలను గుర్తించి వారికి బ్యాంకు లింకేజీ ద్వారా పెరటి కోళ్లు, గేదెలు, పౌల్ట్రీ, చిన్న పరిశ్రమలు, ఎంటర్​ప్రైజెస్, ఈ సేవా, నాటు కోళ్ల పెంపకం, వ్యవసాయ యంత్రాల అద్దె నిర్వహణ వంటి పనులను కల్పించేందుకు కృషి చేయాలన్నారు. లీడ్  బ్యాంక్  మేనేజర్  శ్రీనివాసరావు, పాడి పరిశ్రమ అభివృద్ధి అధికారి ధనరాజ్  పాల్గొన్నారు.