నాగర్​ కర్నూల్ జిల్లాలో డ్రగ్స్​పై నిఘా పెంచాలి : బదావత్ సంతోష్

నాగర్​ కర్నూల్, వెలుగు: జిల్లాలో డ్రగ్స్​ రవాణా, అమ్మకాలపై నిఘా పెంచాలని కలెక్టర్‌‌‌‌ బదావత్  సంతోష్  అధికారులను ఆదేశించారు. ఎస్పీ గైక్వాడ్  వైభవ్  రఘునాథ్, డీఎఫ్​వో రోహిత్​ గోపిడీతో కలిసి బుధవారం కలెక్టరేట్‌‌‌‌ వీడియో కాన్ఫరెన్స్ హాల్​లో మాదక ద్రవ్య నిరోధక సమన్వయ కమిటీ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్​ మాట్లాడుతూ గంజాయి ఉత్పత్తి, రవాణా, వినియోగంపై నిఘా పెట్టి నిర్మూలనకు కృషి చేయాలన్నారు. జిల్లా వ్యాప్తంగా అన్ని విద్యాసంస్థల్లో యాంటీ డ్రగ్  కమిటీలను ఏర్పాటు చేసి మత్తు పదార్థాల వినియోగం, అనర్ధాలపై విద్యార్థులకు అవగాహన కల్పించాలన్నారు.

యాంటీ  డ్రగ్  కమిటీలో పోలీస్, స్టూడెంట్, టీచర్, పేరెంట్స్​ ఉండేలా చూడాలన్నారు. హాస్టల్స్​లో తనిఖీలు నిర్వహించాలన్నారు. స్వచ్ఛంద సంస్థలను మాదకద్రవ్యాల నిర్మూలనలో భాగస్వాములను చేయాలన్నారు. గంజాయి వినియోగిస్తున్న వారిని  డీ -అడిక్షన్  సెంటర్లకు రెఫర్​​చేయాలన్నారు. ఎస్పీ మాట్లాడుతూ గంజాయి అక్రమ రవాణాను అరికట్టడానికి పోలీస్‌‌‌‌ యంత్రాంగం పటిష్ఠ ఏర్పాట్లు చేసిందని చెప్పారు. చెక్‌‌‌‌పోస్ట్​ల వద్ద నిఘా ఏర్పాటు చేశామన్నారు.