కొండారెడ్డిపల్లిలో డెవలప్​మెంట్​ వర్క్స్​ కంప్లీట్​ చేయాలి : కలెక్టర్  బదావత్ సంతోష్

వంగూర్, వెలుగు: సీఎం స్వగ్రామం కొండారెడ్డిపల్లిలో జరుగుతున్న అభివృద్ధి పనులను స్పీడప్​ చేయాలని కలెక్టర్  బదావత్ సంతోష్  సంబంధిత అధికారులను ఆదేశించారు. శనివారం కొండారెడ్డిపల్లిలో పర్యటించి పనులను పరిశీలించారు. సీఎం పర్యటన కోసం హెలిప్యాడ్  స్థలాన్ని పరిశీలించిన అనంతరం అధికారులు, కాంట్రాక్టర్లతో గ్రామపంచాయతీలో సమావేశం నిర్వహించారు. రోడ్ల విస్తరణ, లైటింగ్, సోలార్  విద్యుత్  వంటి అభివృద్ధి పనులను వెంటనే పూర్తి చేయాలని ఆదేశించారు.

సోలార్  ప్లేట్లను బిగించే పనులను ప్రారంభించాలని సూచించారు. దసరాలోగా పనులన్నీ పూర్తి చేయాలని, కొండారెడ్డిపల్లి గ్రామాన్ని మోడల్  విలేజ్​గా తీర్చిదిద్దాలన్నారు. అడిషనల్​ కలెక్టర్  దేవసహాయం, నోడల్  ఆఫీసర్​ జీవీ రమేశ్, డీఆర్డీవో చిన్న ఓబులేషు, విద్యుత్​శాఖ ఎస్ఈ వెంకటేశ్వర్లు, కల్వకుర్తి ఆర్డీవో శ్రీనివాస్, మాజీ జడ్పీటీసీ కేవీఎన్ రెడ్డి పాల్గొన్నారు.

రేబిస్​ వ్యాధిపై అవగాహన పెంచుకోవాలి

కల్వకుర్తి: రేబిస్  వ్యాధికి చికిత్స లేదని, నివారణ ఒక్కటే మార్గమని కలెక్టర్  బదావత్  సంతోష్  పేర్కొన్నారు. జునోసిస్‌‌‌‌  డే సందర్భంగా పట్టణంలోని జడ్పీ హైస్కూల్​ ఆవరణలో జరిగిన ఉచిత రేబిస్‌‌‌‌  వ్యాధి నిరోధక టీకాల కార్యక్రమం, అవగాహన సదస్సుకు హాజరయ్యారు. డీఎంహెచ్ వో స్వరాజ్యలక్ష్మి, మున్సిపల్  చైర్మన్  ఎడ్మ సత్యం పాల్గొన్నారు.