దసరాలోగా పనులు కంప్లీట్​ చేయాలి : కలెక్టర్ బదావత్ సంతోష్

  • కొండారెడ్డిపల్లిలో పనులు పరిశీలించిన కలెక్టర్

వంగూర్, వెలుగు : సీఎం రేవంత్ రెడ్డి స్వగ్రామమైన కొండారెడ్డిపల్లిలో జరుగుతున్న అభివృద్ధి పనులను దసరాలోగా కంప్లీట్​ చేయాలని కలెక్టర్  బదావత్  సంతోష్   సంబంధిత అధికారులను ఆదేశించారు.  శుక్రవారం వివిధ శాఖల అధికారులతో కలిసి కొండారెడ్డిపల్లిలో పర్యటించి గవర్నమెంట్​ స్కూల్, లైబ్రరీ, పాలశీతలీకరణ కేంద్రం, గ్రామ పంచాయతీ, బీసీ కమ్యూనిటీ హాల్, వెటర్నరీ హాస్పిటల్​ పనులను పరిశీలించారు.  అనంతరం అధికారులు, కాంట్రాక్టర్లతో సీఎం ఇంట్లో రివ్యూ మీటింగ్​  నిర్వహించారు. 

ఈ సందర్భంగా కలెక్టర్  మాట్లాడుతూ.. రోడ్ల విస్తరణ, అండర్  డ్రైనేజీ, శ్రీశైలం హైవే నుంచి గ్రామం వరకు 4 లేన్ల రోడ్డు, లైటింగ్​ వంటి అభివృద్ధి పనులను పూర్తి చేయాలని ఆదేశించారు.  వంగూరు మండల కేంద్రంలో ఇంటిగ్రేటెడ్​ ఆఫీస్​ బిల్డింగ్, వంగూరు నుంచి జూపల్లి వరకు రోడ్డు విస్తరణ, సర్వారెడ్డిపల్లి నుంచి వంగూరు మీదుగా కొండారెడ్డిపల్లి డబుల్  రోడ్డు పనులకు సంబంధించిన ప్రక్రియను కంప్లీట్​ చేసి పనులు ప్రారంభించాలని సూచించారు. పనులన్నీ దసరా లోపు పూర్తి చేయాలని ఆదేశించారు. 

దసరా పండుగకు సీఎం కొండారెడ్డిపల్లికి వస్తున్న దృష్ట్యా అభివృద్ధి పనులను ప్రారంభించేందుకు సిద్ధం చేయాలన్నారు. అంతకుముందు అంగన్​వాడీ కేంద్రాన్ని సందర్శించి చిన్నారులకు అందిస్తున్న పౌష్టికాహారాన్ని పరిశీలించారు. చిన్నారుల వివరాలను అడిగి తెలుసుకున్నారు. అడిషనల్​ కలెక్టర్  దేవ సహాయం, జిల్లా పశు సంవర్ధక శాఖ అధికారి జీవీ రమేశ్, డీఈ చంద్రకళ, ఏఈ మణిపాల్ నాయక్, తహసీల్దార్  కిరణ్మయి, మాజీ జడ్పీటీసీ కేవీఎన్ రెడ్డి, ఎనుముల వేమారెడ్డి, లాలు యాదవ్ పాల్గొన్నారు.

పోలీసులు ఆరోగ్యంపై శ్రద్ధ చూపాలి

నాగర్ కర్నూల్ టౌన్ : పోలీసులు తమ ఆరోగ్యాన్ని కాపాడుకోవడంపై దృష్టి పెట్టాలని కలెక్టర్  బదావత్  సంతోష్  సూచించారు. పట్టణంలోని పోలీస్ స్టేషన్  ఆవరణలో యూనిట్  హాస్పిటల్ ను ఎమ్మెల్యే కూచుకుళ్ల రాజేశ్ రెడ్డి, ఎస్పీ గైక్వాడ్  వైభవ్  రఘునాథ్ తో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లాలోని వెయ్యి పోలీస్  కుటుంబాలకు ఆరోగ్య సేవలు అందించేందుకు యూనిట్​ హాస్పటల్​ ఏర్పాటు చేయడం అభినందనీయమన్నారు.

పోలీసులు శారీరకంగా, మానసికంగా ఇబ్బంది పడుతూ పని చేయాల్సి వస్తోందన్నారు. ఆరోగ్యాన్ని కాపాడుకోవడం కూడా ముఖ్యమేనని గుర్తించాలన్నారు. డీఎంహెచ్​వో స్వరాజ్యలక్ష్మి, అడిషనల్  ఎస్పీ ఏఆర్  భరత్, డీఎస్పీలు సత్యనారాయణ, శ్రీనివాసులు, శ్రీనివాస్, వెంకటేశ్వర్లు, నరసింహులు, సీఐ కనకయ్య పాల్గొన్నారు.