డిజిటల్​ కార్డుల సర్వేను పక్కాగా నిర్వహించాలి: కలెక్టర్  బదావత్  సంతోష్

కల్వకుర్తి, వెలుగు: ఫ్యామిలీ డిజిటల్ కార్డుల సర్వేను పకడ్బందీగా నిర్వహించాలని కలెక్టర్  బదావత్  సంతోష్  ఆదేశించారు. పైలెట్ ప్రాజెక్టు కింద ఎంపికైన వెల్డండ మండలం కంటోనిపల్లి గ్రామంలో జరుగుతున్న సర్వేను పరిశీలించారు. ఫ్యామిలీ డేటా బేస్  ఆధారంగా అధికారులు సర్వే నిర్వహిస్తున్న తీరును పరిశీలించి పలు సూచనలు చేశారు. ఎలాంటి తప్పులకు అవకాశం లేకుండా వివరాలను నమోదు చేయాలని సూచించారు.

నిర్ణీత సమయంలో సర్వేను పూర్తి చేయాలని, ఏ ఒక్క ఫ్యామిలీ తప్పిపోకుండా సర్వే నిర్వహించాలని ఆదేశించారు. ప్రజలు సర్వేపై ఎలాంటి అపోహలకు లోను కావాల్సిన అవసరం లేదన్నారు. అనంతరం అంగన్​వాడీ కేంద్రాన్ని పరిశీలించారు. గుడ్లు, సన్న బియ్యం నాణ్యతను పరిశీలించారు. ఎల్ఆర్ఎస్  ప్రక్రియను పరిశీలించి పలు సూచనలు చేశారు. కల్వకుర్తి ఆర్డీవో   శ్రీనివాస్, తహసీల్దార్  కార్తీక్ కుమార్  ఉన్నారు.