ప్రతి గ్రామపంచాయతీలో కొనుగోలు కేంద్రం

వనపర్తి, వెలుగు: జిల్లాలోని ప్రతి గ్రామ పంచాయతీలో కొనుగోలు కేంద్రం ఏర్పాటు చేయాలని కలెక్టర్​ ఆదర్శ్​ సురభి అధికారులను ఆదేశించారు. శుక్రవారం కలెక్టర్  క్యాంప్​ ఆఫీస్​లో వడ్ల కొనుగోలుపై రివ్యూ మీటింగ్​  నిర్వహించారు. నాణ్యమైన వడ్లు తీసుకొనేలా, దొడ్డు, సన్న రకం వడ్లను గుర్తించేలా సిబ్బందికి పూర్తి స్థాయి శిక్షణ ఇవ్వాలని వ్యవసాయ, గ్రామీణాభివృద్ధి శాఖ అధికారులను ఆదేశించారు. తూకం, తేమ యంత్రాలను తనిఖీ చేసి సరిగా పని చేస్తున్నాయో లేదో సరి చూసుకోవాలన్నారు. అవసరం  మేరకు గన్నీ బ్యాగులు, టార్పాలిన్లు అందుబాటులో ఉంచుకోవాలని సూచించారు.

పాలమూరు-రంగారెడ్డి, కల్వకుర్తి లిఫ్ట్​ ఇరిగేషన్​ కాలువలు, రిజర్వాయర్​ పనుల భూసేకరణను యుద్ధప్రాతిపదికన పూర్తి చేయాలని ఆదేశించారు. బండరావిపాకుల, కానాయపల్లి పునరావాస కేంద్రాలకు అవసరమైన స్థలాలను గుర్తించాలన్నారు.

మెడికల్​ కాలేజీ గర్ల్స్​​హాస్టల్​ బిల్డింగ్​ను వచ్చే నెల ఒకటో తేది నాటికి పూర్తి చేయాలన్నారు. అడిషనల్​ కలెక్టర్ నగేశ్, డీఏవో గోవింద్ నాయక్, సివిల్  సప్లై ఆఫీసర్​ విశ్వనాథ్, డీఎం  ఇర్ఫాన్,  డీఆర్డీవో ఉమాదేవి, డీఎంవో స్వరన్ సింగ్, మున్సిపల్  కమిషనర్  పూర్ణచందర్  పాల్గొన్నా