వనపర్తి జిల్లాలో 2,74,887 మంది ఓటర్లు

వనపర్తి, వెలుగు : స్పెషల్  సమ్మరీ రివిజన్–2025లో భాగంగా నేడు ముసాయిదా ఓటర్​ జాబితాను విడుదల చేస్తామని కలెక్టర్  ఆదర్శ్  సురభి తెలిపారు. ముసాయిదా ఓటరు జాబితా మంగళవారం నుంచి జిల్లాలోని  అన్ని పోలింగ్  కేంద్రాల్లో అందుబాటులో ఉంచుతామని చెప్పారు. ఈ ఏడాది ఫిబ్రవరి2న ప్రకటించిన ఓటరు జాబితా ప్రకారం జిల్లాలో 2,72,653 మంది ఓటర్లు ఉండగా, ప్రస్తుతం 2,74,887 మంది ఓటర్లు ఉన్నట్లు తెలిపారు. 5,455 మంది కొత్త ఓటర్లు నమోదు కాగా, 3,221మంది పేర్లను తొలగించారు. 1,36,208 మంది పురుషులు, 1,38,676 మంది మహిళలు ఉన్నారు. ముసాయిదా ఓటరు జాబితాలో అభ్యంతరాలు, మార్పులు, చేర్పులు ఉంటే వచ్చే నెల 28 వరకు దరఖాస్తు చేసుకోవచ్చని కలెక్టర్  తెలిపారు.