సరైన సమయంలో టీకాలు ఇవ్వాలి : కలెక్టర్​ ఆదర్శ్ సురభి

  • గద్వాల, వనపర్తి జిల్లాల మెడికల్​ఆఫీసర్ల శిక్షణలో కలెక్టర్​ 

వనపర్తి, వెలుగు : గర్భిణులకు, పిల్లలకు సరైన సమయంలో టీకాలు ఇవ్వాలని వనపర్తి జిల్లా కలెక్టర్ ఆదర్శ్ సురభి అన్నారు.   మంగళవారం వనపర్తి మున్సిపాలిటీలో  జోగులాంబ గద్వాల, వనపర్తి జిల్లాల వ్యాక్సినేషన్ ప్రోగ్రాం నిర్వహించారు. ఈ సందర్భంగా  మెడికల్ ఆఫీసర్లు, హెల్త్ సూపర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ వైజర్లకు  టీకాలపై ఒక రోజు శిక్షణ ఇచ్చారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ..  టీకాలను గర్భిణులకు, పిల్లలకు ఒక నిర్దిష్ట  సమయంలో ఇస్తేనే అవి సమర్థవంతంగా పనిచేస్తాయన్నారు.  

టీకాల పై పూర్తిస్థాయి శిక్షణ పొంది మండల స్థాయిలో ఏఎన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఎం ఆశా వర్కర్లకు శిక్షణ ఇవ్వాలని సూచించారు.  పిల్లలకు టీకాలను ఇప్పించడంతో  వనపర్తి జిల్లా రాష్ట్రంలో మూడో స్థానంలో నిలిచిందన్నారు. దీని కోసం కృషి చేసిన ప్రతి ఒక్కరికీ కలెక్టర్ అభినందనలు తెలిపారు.   సమావేశంలో అడిషనల్​ కలెక్టర్  సంచిత్ గంగ్వార్,  డీఎంహెవో శ్రీనివాసులు,  డిప్యూటీ డీఎంహెచ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌వో  బి. శ్రీనివాస్, ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రతినిధులు  మురారి,  డా. అజర్,  డా. డేవిడ్,  డా. జ్యోత్న్స, ప్రోగ్రాం ఆఫీసర్లు డా. సాయినాథ్ రెడ్డి, పరిమళ, వంశీ, మెడికల్ ఆఫీసర్లు, హెల్త్ సూపర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌వైజర్లు పాల్గొన్నారు.