హాస్పిటల్​ రిపేర్లు త్వరగా పూర్తిచేయాలి : కలెక్టర్ ఆదర్శ్ సురభి

వనపర్తి, వెలుగు: గవర్నమెంట్ జనరల్​హాస్పిటల్​లో రిపేర్లను త్వరగా పూర్తి చేసి ఆక్సిజన్ ప్లాంట్ ను వినియోగంలోకి తేవాలని వనపర్తి కలెక్టర్ ఆదర్శ్ సురభి ఆదేశించారు. వనపర్తి ఆస్పత్రిని ఆయన మంగళవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు.  బిల్డింగ్​పరిసరాలతో పాటు పోస్ట్​మార్టం రూమ్​, కొత్తగా ఏర్పాటు చేస్తున్న ఆక్సిజన్ ప్లాంట్, స్టాఫ్ రూమ్ ను పరిశీలించారు. పనులు నాణ్యతతో చేయాలని , నిధులు అవసరమైతే వెంటనే ప్రతిపాదనలు పంపాలని ఆదేశించారు. 

 మాతా శిశు సంరక్షణ కేంద్రంలో సైతం అప్పుడే పుట్టిన పిల్లల వార్డుకు ఆక్సిజన్ సౌకర్యం అందించే విధంగా మరో ప్లాంట్ నెలకొల్పాలని శ్రీభారత్ ఫార్మా సిబ్బందిని సూచించారు.  కార్యక్రమంలో సూపరింటెండెంట్ రంగారావు, టీఎస్ఎం, ఐడీసీడీఈలు, ఆర్ఎంవో ఉన్నారు.