టార్పాలిన్లు అందుబాటులో ఉంచాలి

మదనాపురం, వెలుగు: కొనుగోలు కేంద్రాల్లో టార్పాలిన్  కవర్లను అందుబాటులో ఉంచాలని కలెక్టర్  ఆదర్శ్  సురభి ఆదేశించారు. మంగళవారం మండల కేంద్రంలోని మార్కెట్  యార్డులోని కొనుగోలు కేంద్రాన్ని తనిఖీ చేశారు. వివరాలను ఐకేపీ ఏపీఎం కృష్ణవేణిని అడిగి తెలుసుకున్నారు. రైతులకు ఇబ్బంది కలగకుండా సౌలతులు కల్పించాలని ఆదేశించారు. 

రైతులు దళారులను ఆశ్రయించకుండా ప్రభుత్వ కొనుగోలు కేంద్రాల్లో వడ్లు అమ్ముకోవాలని సూచించారు. అనంతరం రైతు వేదికలో నిర్వహించిన సమగ్ర సర్వే శిక్షణ కార్యక్రమాన్ని పరిశీలించి మాట్లాడారు. సర్వేను పకడ్బందీగా నిర్వహించాలని సూచించారు. మండల ప్రత్యేక అధికారి మల్లికార్జున్, తహసీల్దార్  అబ్రహం లింకన్, ఎంపీడీవో ప్రసన్న కుమారి, ఏఈవో రజిని పాల్గొన్నారు.