గ్రూప్ 3 ని పకడ్బందీగా నిర్వహించాలి : కలెక్టర్ ఆదర్శ్ సురభి

నపర్తి టౌన్, వెలుగు: జిల్లాలో గ్రూప్ 3 పరీక్షలను   పకడ్బందీగా నిర్వహించేందుకు అధికారులు చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ ఆదర్శ్ సురభి ఆదేశించారు. మంగళవారం జిల్లా కలెక్టర్ కార్యాలయంలో ఈ నెల 17, 18 తేదీల్లో నిర్వహించనున్న గ్రూప్ 3 పరీక్షల నిర్వహణపై అధికారులతో రివ్యూ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆఫీసర్స్, ఐడెంటిఫికేషన్ ఆఫీసర్స్, రూట్ ఆఫీసర్స్, ఫ్లయింగ్ స్క్వాడ్ లు, ఇతర అధికారులకు వారి బాధ్యతలపై కలెక్టర్ అవగాహన కల్పించారు. అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ వనపర్తి జిల్లాలో మొత్తం 8312 మంది విద్యార్థులు గ్రూప్ 3 పరీక్షలు రాయనున్నారని తెలిపారు.

జిల్లలో వనపర్తి, కొత్తకోటలో కలిపి మొత్తం 31 పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేసినట్లు వివరించారు. గ్రూప్ 3 పరీక్షలను అత్యంత పకడ్బందీగా నిర్వహించేలా అధికారులు తమ విధులు నిర్వహించాలని, ఏమాత్రం రూల్స్ అతిక్రమించిన కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. జిల్లాలోని అన్ని పరీక్షా కేంద్రాలలో విద్యార్థులకు అవసరమైన అన్ని సౌకర్యాలు ఏర్పాటు చేసుకోవాలని సూచించారు.

పరీక్ష రోజు డిపార్ట్​మెంట్​ ఆఫీసర్స్ తో పాటు ఏ ఒక్క వ్యక్తి మొబైల్ ఫోన్ తో పరీక్షా కేంద్రంలోకి వెళ్ళడానికి అనుమతి లేదని తెలిపారు. కేవలం చీఫ్ సూపరింటెండెంట్ కు మాత్రమే సెల్ ఫోన్ అనుమతి ఉంటుందని అదికూడా ఛాంబర్ దాటి బయటికి తీసుకెళ్ళడానికి వీలు లేదన్నారు. కార్యక్రమంలో అడిషనల్ కలెక్టర్ సంచిత్ గంగ్వార్, రీజినల్ కోఆర్డీనేటర్ రామ్ నరేశ్​, డిపార్ట్మెంటల్ ఆఫీసర్స్, రూట్ ఆఫీసర్స్ పాల్గొన్నారు.