టీచర్లు స్కూల్​కు లేట్​గా వస్తే చర్యలు : కలెక్టర్​ ఆదర్శ్​ సురభి

వనపర్తి, వెలుగు : జిల్లాలోని అన్ని స్కూళ్లలో ఇంగ్లిష్​ మీడియంలో బోధించాలని కలెక్టర్​ ఆదర్శ్​ సురభి సూచించారు. శుక్రవారం కలెక్టరేట్​లో ఎంఈవోలు, కాంప్లెక్స్  హెచ్ఎంలతో సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ అన్ని గవర్నమెంట్​ స్కూళ్లలో సౌలతులు కల్పించామని, స్టూడెంట్ల ఎన్​రోల్​మెంట్​ పెంచాలని ఆదేశించారు.

విద్యార్థులు డ్రాప్ అవుట్  కాకుండా చూసుకోవాలని, ఈ సారి ఎస్సెస్సీలో ఉత్తీర్ణతా శాతం గణనీయంగా పెరగాలన్నారు. టీచర్లు  ప్రతిరోజూ టైమ్​కు స్కూల్​కు చేరుకోవాలని, సమయపాలన పాటించకుంటే చర్యలు తప్పవని హెచ్చరించారు. విధుల పట్ల నిర్లక్ష్యం చేసే టీచర్లపై చర్యలు తీసుకుంటామన్నారు. డీఈవో గోవిందరాజు పాల్గొన్నారు.

వ్యాధులు ప్రబలకుండా చర్యలు తీసుకోవాలి

గోపాల్ పేట, వెలుగు : సీజనల్​ వ్యాధులు ప్రబలకుండా జాగ్రత్తలు తీసుకోవాలని, జ్వరాలు నమోదవుతున్న ప్రాంతాల్లో ఫీవర్  సర్వే చేయాలని  కలెక్టర్  ఆదర్శ్  సురభి అదేశించారు. డ్రై డే సందర్భంగా మండలంలోని జయన్న తిర్మలాపూర్ గ్రామంలో పనులను పరిశీలించారు. గత నెల డెంగ్యూ కేసు నమోదైన ఇంటిని సందర్శించి, వారి ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. పరిసరాలను శుభ్రంగా ఉంచుకోవాలని

నీళ్లు నిల్వ ఉండకుండా చూసుకోవాలని సూచించారు. అనంతరం అంగన్​వాడీ కేంద్రాన్ని సందర్శించి రిజిస్టర్లు, స్టాక్ ను పరిశీలించారు. ప్రత్యేకాధికారి లక్ష్మిబాయి, మెడికల్​ ప్రోగ్రాం ఆఫీసర్  సాయినాథ్ రెడ్డి, తహసీల్దార్  తిలక్, ఎంపీడీవో శంకర్ నాయక్, మున్సిపల్  కమిషనర్  పూర్ణ చందర్, కౌన్సిలర్  బ్రహ్మచారి తదితరులు పాల్గొన్నారు.