వనపర్తిలో పకడ్బందీగా ఇంటింటి సర్వే : కలెక్టర్​ ఆదర్శ్​ సురభి

వనపర్తి, వెలుగు : సమగ్ర ఇంటింటి కుటుంబ సర్వే పకడ్బందీగా పూర్తి చేయాలని కలెక్టర్ ఆదర్శ్ సురభి ఆదేశించారు. మంగళవారం కలెక్టరేట్​లో మండల ప్రత్యేక అధికారులు, తహసీల్దార్లు, ఎంపీడీఓలు, ఎంపీఓలకు శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. ట్రైనర్ లు సర్వే ఏ విధంగా చేయాలి, ఎన్యుమరెటర్ల బాధ్యతల పై అవగాహన కల్పించారు. 

సర్వే చేసేందుకు మునిసిపాలిటీ , గ్రామీణ ప్రాంతాలను ఎన్యూమరేటర్ బ్లాక్ లుగా విభజించి అందులో 150 కుటుంబాలకు ఒక బ్లాక్ నెంబర్ కేటాయించాలన్నారు. ఒక్కో ఎన్యూమరెటర్ కు ఒక్కో బ్లాక్ సర్వే బాధ్యతలు అప్పగిస్తామన్నారు. 2011 లో గుర్తించిన బ్లాక్ లను ప్రామాణికంగా తీసుకొని ఎన్యుమరేటర్లు ప్రస్తుతం ఉన్న కుటుంబాల సంఖ్యను గుర్తించాల్సి ఉంటుందన్నారు. సదస్సులో అడిషనల్​ కలెక్టర్లు సంచిత్ గంగ్వార్, వెంకటేశ్వర్లు, మాస్టర్​ ట్రైనర్లు భూపాల్ రెడ్డి, జడ్పీ సీఈఓ యాదయ్య,  పాల్గొన్నారు.