నార్త్ ఇండియాను వణికిస్తున్న చలి

నార్త్ ఇండియాను వణికిస్తున్న చలి
  •     పడిపోతున్న టెంపరేచర్లు
  •     ఈ నెల 14 దాకా పలుచోట్ల వర్షాలు

న్యూఢిల్లీ: చలిగాలులు నార్త్ ఇండియాను వణికిస్తున్నాయి. ఈశాన్య రాష్ట్రాల్లోని హిల్​స్టేషన్లలో మంచు కురుస్తుండటంతో టెంపరేచర్లు మైనస్ డిగ్రీలకు పడిపోతున్నాయి. ఇదిలా ఉండగా వచ్చే మూడు రోజుల పాటు అరేబియా, బంగాళాఖాతం నుంచి చలిగాలులు వీస్తాయని ఇండియన్ మెట్రోలజికల్ డిపార్ట్​మెంట్(ఐఎండీ) హెచ్చరించింది. దీంతో టెంపరేచర్లు మరింతగా పడిపోయే అవకాశముందని చెప్పింది. గాలుల ఎఫెక్ట్​తో మహారాష్ట్ర, చత్తీస్​గఢ్, బిహార్, జార్ఖండ్, ఒడిశా, వెస్ట్ బెంగాల్, సిక్కిం, హర్యానాలో ఈ నెల 14 దాకా మోస్తరు వర్షాలు కురిసే చాన్స్ ఉందని తెలిపింది. పశ్చిమ హిమాలయ ప్రాంతం లో, ఈశాన్య రాష్ట్రాల్లో దట్టమైన పొగమంచు పడుతుందని పేర్కొం ది. బుధ, గురువారాల్లో ఉత్తరప్రదేశ్, తూర్పు మధ్యప్రదేశ్, రాజస్థాన్​లో అక్కడక్కడా వర్షాలు పడొచ్చని అంచనా వేసింది. 12,13 తేదీల్లో తెలంగాణలో భారీ వర్షాలు, అస్సాం, మేఘాలయ, నాగాలాండ్, మణిపూర్, త్రిపురలో చెదురుమొదురు వర్షాలు పడతాయని ఐఎండీ వెల్లడించింది. 

పొగమంచు ఎఫెక్ట్.. విమాన సర్వీసులు ఆలస్యం
దేశ రాజధాని ఢిల్లీని పొగమంచు కమ్మేసింది. దట్టమైన పొగమంచు కారణంగా మంగళవారం ఉదయం ఢిల్లీ ఎయిర్​పోర్టులో పలు విమానాల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. పూర్ విజిబిలిటీతో ఉదయం 6 నుంచి 8గంటల మధ్య బయల్దేరాల్సి ఫ్లైట్లు ఆలస్యంగా టేకాఫ్ అయ్యాయి.