చలి పంజా.. వణికిపోతున్న తెలంగాణ.. హైదరాబాద్లో కూడా అదే పరిస్థితి.. ఒకేరోజు 4 డిగ్రీల టెంపరేచర్ డౌన్

తెలంగాణలో చలి పంజా విసురుతోంది. గురువారం (జనవరి 9,2025) తెలంగాణ వ్యాప్తంగా ఉష్ణోగ్రతలు అత్యంత కనిష్టానికి పడిపోయాయి.మంచు, చలిగాలులతో గ్రామాలతో సహా హైదరాబాద్ లో కూడా చలి తీవ్రత పెరిగింది. ప్రజలు ఇండ్లనుంచి బయటికి వచ్చేందుకు వణికిపోతున్నారు. ఉదయం 11గంటలు అయితే తప్పా చలి తగ్గడంలేదు.  

తెలంగాణ వ్యాప్తంగా చలి పంజా విసిరింది. హైదరాబాద్ నగరంతోపాటు రాష్ట్రంలోని అన్ని ప్రాంతాల్లో చలి తీవ్ర బాగా పెరింగింది. గురువారం ( జనవరి 9, 2025) ఉదయం ఉష్ణోగ్రతలు నాలుగు డిగ్రీలు తగ్గింది. చాలా ప్రాంతాల్లో సింగిల్ డిజిట్ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ఈ సీజన్ లో ఇదే అత్యధికం.   

ఆదిలాబాద్ జిల్లాలో చలితీవ్రత అత్యధికంగా ఉంది. జిల్లాలో ఉష్ణోగ్రతలు సింగిల్ డిజిట్ కు  పడిపోయాయి. బేలా లో 5.9 డిగ్రీలు, సిర్పూర్ లో 6.1, తిర్యానిలో 6.1, చాప్రాలాలో 6.7 కోహిర్ లో 6.9 డిగ్రీలు, డోంగ్లీలో7.3డిగ్రీలకనిష్ణ ఉష్ణోగ్రతలు నమోదు అయ్యాయి.   

ఇక రాష్ట్ర రాజధాని హైదరాబాద్ , దాని పరిసర ప్రాంతాల్లో కూడా చలి విపరీతంగా పెరిగింది. సింగిల్ డిజిట్ లో ఉష్ణోగ్రతలు నమోదు అయ్యాయి. గురువారం రోజు 2నుంచి 4 డిగ్రీల గ్రతలు పడిపోయాయి. రంగారెడ్డి జిల్లా మొయినాబాద్ లో 8.5 డిగ్రీలు, ఇబ్రహీం పట్నంలో 9.3 డిగ్రీలు, హైదరాబాద్ క్యాంపస్ లో 9.7 డిగ్రీలు, ఉప్పల్ పరిధిలోని మౌలాలి లో 10.1 డిగ్రీల కనిష్ట ఉష్ణోగ్రతలు పడిపోయాయి. 

రాబోయే రోజుల్లో రాష్ట్రవ్యాప్తంగా చలి తీవ్రత పెరిగే అవకాశం ఉందని మరో రెండు రోజులు ఇదే పరిస్థితి ఉండొచ్చనితెలిపింది. ఇండియన్ మెటరోలాజికట్ డిపార్టుమెంట్ (IMD) చెబుతోంది. మరో రెండు రోజులు ఇదే పరిస్థితి ఉండొచ్చనితెలిపింది. తెలంగాణ వ్యాప్తంగా ఉదయం వేళల్లో పొగమంచు, చలిగాలులు వీచే అవకాశం ఉందని వెల్లడించింది.