వణుకుతోన్న ఉత్తర భారతం...భారీగా కమ్మేసిన పొగమంచు

వింటర్ సీజన్ లో ఉత్తర భారతం వణుకుతోంది. పలు రాష్ట్రాల్లో ఉష్ణోగ్రతలు దారుణంగా పడిపోతున్నాయి.  అటు దేశ రాజధాని ఢిల్లీలో చలితీవ్రత రోజురోజుకు పెరుగుతోంది. ఉత్తరభారతంలో వీస్తున్న చలిగాలులతో ఢిల్లీలో టెంపరేచర్ పది డిగ్రీలలోపే రికార్డు అవుతోంది. రెడ్ పోర్ట్, ఢిల్లీగేట్, అక్షర్ ధామ్, కరోల్ బాగ్ సహా పలుచోట్ల చలి తీవ్రత భారీగా పెరిగింది. ఉపశమనం కోసం పలుచోట్ల చలిమంటలు కాచుకుంటున్నారు. ఉదయం పూట ఇళ్లనుంచి బయటకురావాలంటే జనం జంకుతున్నారు. అటు దట్టమైన పొగమంచు, ఎయిర్ పొల్యూషన్ తో రాజధాని వాసులు అవస్థలు పడుతున్నారు. సరైన వెలుతురులేకపోవటంతో...అత్యవసర పనులు ఉంటేతప్ప వాహనదారులు బయటకు రావటం లేదు.

దట్టమైన పొగమంచుతో న్యూ ఢిల్లీ రైల్వేస్టేషన్ లో రైళ్ల రాకపోకలు ఆలస్యమవుతున్నాయి. సరైన వెలుతురులేకపోవటం వల్లే ట్రైన్ ల షెడ్యూల్ మార్చినట్లు సిబ్బంది చెప్పారు. 

యూపీలోని పలుప్రాంతాలను దట్టమైన పొగమంచు కప్పేసింది. ప్రఖ్యాత అయోధ్య, వారణాసీలో చలితీవ్రత పెరిగింది. చలిలోనే అయోధ్యలో భక్తులు దర్శనం చేసుకుంటున్నారు. కోల్డ్ ఎఫెక్ట్ ఉన్నా భక్తుల రద్దీ కొనసాగుతోంది. అటు అయోధ్య పరిసరాలను భారీగా పొగమంచు కప్పేసింది. టెంపరేచర్లు పదిలోపే నమాదు అవుతుండటంతో...స్థానికులు చలిమంటలతో ఉపశమనం పొందుతున్నారు. 

హర్యానాలోని పలుప్రాంతాలను దట్టమైన పొగమంచు కప్పేసింది. మార్నింగ్ ఎనిమిది దాటినా...సరైన వెలుతురులేక పోవటంతో వాహనాల రాకపోకలు స్తంభించాయి. ఎయిర్ పొల్యూషన్, పొగమంచుతో చండీఘర్ లో జనం ఇళ్ల నుంచి బయటకు రావటంలేదు. చలి వణికిస్తుండటంతో...స్థానికులు మాప్లర్లు, జాకేట్లు ధరించి నిత్యవసర వస్తువుల కోసం ఇళ్లనుంచి బయటకు వస్తున్నారు.