సిటీలో కోడిపందాలు

  • 11 మంది అరెస్ట్

జీడిమెట్ల, వెలుగు: కోడిపందాల సంస్కృతి సిటీకి పాకింది. కుత్బుల్లాపూర్​ మున్సిపల్ ​గ్రౌండ్​లో కోడిపందాలు ఆడుతున్నారన్న సమాచారంతో పోలీసులు ఆదివారం దాడులు నిర్వహించారు.11 మందిని అదుపులోకి తీసుకున్నారు. వారి నుంచి రూ.15 వేల నగదు, 6 కోళ్లు, 16 కత్తులు, 9 మొబైల్​ ఫోన్స్​స్వాధీనం చేసుకున్నారు. జీడిమెట్ల పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు