కొచ్చిన్‌‌‌‌‌‌‌‌ షిప్‌‌‌‌‌‌‌‌యార్డ్‌‌‌‌‌‌‌‌లో ట్రెయినీ జాబ్స్​

-కొచ్చిన్‌‌‌‌‌‌‌‌ షిప్‌‌‌‌‌‌‌‌యార్డ్‌‌‌‌‌‌‌‌ లిమిటెడ్‌‌‌‌‌‌‌‌ (సీఎస్ఎల్‌‌‌‌‌‌‌‌) కాంట్రాక్ట్​ ప్రాతిపదికన ఖాళీగా ఉన్న ట్రెయినీ పోస్టుల భర్తీకి అప్లికేషన్స్​ కోరుతోంది.

పోస్టులు: మొత్తం 64 పోస్టుల్లో షిప్‌‌‌‌‌‌‌‌ డ్రాఫ్ట్స్‌‌‌‌‌‌‌‌మ్యాన్‌‌‌‌‌‌‌‌ ట్రెయినీ (మెకానికల్): 46, షిప్‌‌‌‌‌‌‌‌ డ్రాఫ్ట్స్‌‌‌‌‌‌‌‌మ్యాన్‌‌‌‌‌‌‌‌ ట్రెయినీ (ఎలక్ట్రికల్): 18 పోస్టులు అందుబాటులో ఉన్నాయి. 

అర్హత: పోస్టును అనుసరించి పదో తరగతి, డిప్లొమా (మెకానికల్/ ఎలక్ట్రికల్) ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి. వయసు 25 ఏళ్లు మించకూడదు. డ్యురేషన్​ 2 సంవత్సరాలు ఉంటుంది. రాత పరీక్ష, ప్రాక్టికల్ టెస్ట్ తదితరాల ఆధారంగా ఎంపిక చేస్తారు.

దరఖాస్తులు: అర్హులైన అభ్యర్థులు ఆన్​లైన్​లో  ఆగస్టు 31 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. రూ.600 అప్లికేషన్​ ఫీజు చెల్లించాలి. ఎస్సీ/ ఎస్టీ అభ్యర్థులకు ఫీజులో మినహాయింపు ఉంటుంది. వివరాలకు www.cochinshipyard.in వెబ్​సైట్​లో సంప్రదించాలి.