కోయిలకొండ వీరభద్రుడి గుడిలో నాగుపాము

కోయిలకొండ, వెలుగు: కోయిలకొండలోని వీరభద్రస్వామి ఆలయంలో మంగళవారం నాగుపాము దర్శనమిచ్చింది. ఆలయ అర్చకులు ఉదయం టెంపుల్  తలుపులు తెరవగా, గర్భ గుడిలో పాము పడగ విప్పి కనిపించింది.

కాసేపటి తరువాత పాము అక్కడి నుంచి బయటికి వెళ్లిపోయింది. భక్తులు పూజలు నిర్వహించారు.