మిచాంగ్ బాపట్ల దగ్గర తీరం దాటే అవకాశం ఉందని ఐఎండీ తెలిపింది. బంగాళాఖాతంలో ఏర్పడిన మిచౌంగ్ తీవ్ర తుఫాన్ దూసుకు వస్తోంది. దక్షిణ కోస్తా వైపు గంటకు 13 కిలోమీటర్ల వేగంతో పయనిస్తూ పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ప్రవేశించింది. రేపు (డిసెంబర్ 5) మధ్యాహ్నం బాపట్ల దగ్గర తీవ్ర తుఫానుగానే తీరం దాటుతుందని ఐఎండీ ప్రకటించింది. ప్రస్తుతం నెల్లూరుకు 220కిలోమీటర్ల దూరంలో కొనసాగు తున్న మిచౌంగ్ ఎఫెక్ట్ తో గంటకు 90నుంచి 110కి.మీ గరిష్ట వేగంతో ఈదురు గాలులు వీయనున్నాయి. మిచౌంగ్ తీవ్ర తుఫానుతో సముద్రం అల్లకల్లోలంగా మారింది.
మిచాంగ్ తుపాను రేపు ( డిసెంబర్ 5) బాపట్ల దగ్గర తీరం దాటనుంది. తీరం దాటే సమయంలో తీవ్ర తుపానుగా మారి బాపట్ల.. మచిలీపట్నం మధ్య ఎక్కడైనా ల్యాండ్ అయ్యే అవకాశం ఉంది. డిసెంబర్ 4వ తేదీ మధ్యాహ్నం 12 గంటలకు.. బాపట్ల తీరానికి 300 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమై ఉంది. ప్రస్తుతం ( వార్త రాసే సమయానికి) గంటకు 10 కిలోమీటర్ల వేగంతో ఈదురు గాలులు వీస్తున్నాయి. డిసెంబర్ 5వ తేదీ మంగళవారం మధ్యాహ్నం తర్వాత తీరం దాటనుంది. తీరం దాటే సమయంలో 110 కిలో మీటర్ల వేగంతో గాలులు వీచి ..చెట్లు కూలిపోయే అవకాశం ఉందని ఐఎండీ హెచ్చరించింది. ప్రకాశం, బాపట్ల, గుంటూరు, కృష్ణా, నెల్లూరు జిల్లాలకు రెడ్ అలర్ట్ ప్రకటించారు.
బాపట్ల దగ్గర తీరం దాటుతుండటంతో.. సమీపంలో జాతీయ రహదారి 5, రైల్వే లైన్ ఉంది.. దీంతో రాకపోకలకు అంతరాయం కలిగి.. విద్యుత్ సరఫరా నిలిచే అవకాశం ఉంది. తీర ప్రాంతాలకు ప్రయాణం చేయాలనుకునే వారు.. తమ ప్రయాణాలు వాయిదా వేసుకుంటే మంచిదని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు.