బాత్రూం కిటికీపై ఆ ఫింగర్ ప్రింట్స్ ఎవరివి..? CMRIT కాలేజ్‌ లేడీస్ హాస్టల్ వీడియో బయటకి..

హైదరాబాద్: మేడ్చల్‌ కండ్లకోయ CMRIT కాలేజ్‌లో దారుణం జరిగింది. కాలేజ్‌ లేడీస్ హాస్టల్ బాత్‌రూమ్‌ల్లో వీడియోలు తీశారని హాస్టల్ ముందు స్టూడెంట్స్, విద్యార్థి సంఘాల నాయకులు ధర్నాకు దిగారు. పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. హాస్టల్‌లో వంట చేసే వారే వీడియోలు తీసి ఉంటారని విద్యార్థులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. బాత్రూమ్ కిటికీలపై ఫింగర్ ప్రింట్స్ కనిపించడంతో కచ్చితంగా ఏదో తప్పుగా జరిగిందని స్పష్టమవుతోంది. బాత్రూం వెంటిలేటర్ అద్దాలపై ఫింగర్ ప్రింట్స్ కనిపించాయి. ఈ ఫింగర్ ప్రింట్స్ ఎవరివి..? ఇప్పుడు CMRIT కాలేజ్‌లో ఇదే అంతుచిక్కని ప్రశ్న.  బయట వ్యక్తులు లేడీస్ హాస్టల్ లోపలికి వచ్చి వీడియోలు తీసే అవకాశమే లేదు.

సో.. హాస్టల్ లో విద్యార్థునుల బాగోగులు చూసుకునేందుకు ఉండే సిబ్బంది గానీ, వంట చేసేందుకు ఉండే వాళ్లు గానీ ఈ పని చేసి ఉంటారనేది విద్యార్థునుల అనుమానం. విద్యార్థినుల బాత్రూం పక్కనే పని చేసే వాళ్ల గది ఉండటం కూడా ఈ అనుమానాలు మరింత బలపడేందుకు కారణమవుతుంది. వీడియోలు తీశారని వార్డెన్‌కు తెలిపితే, అసభ్యంగా మాట్లాడుతుందని విద్యార్థినులు ఆవేదన వ్యక్తం చేశారు. వీడియోలు తీసిని వారిని గుర్తించి చర్యలు తీసుకోవాలని విద్యార్థి సంఘాల నాయకులు డిమాండ్ చేసారు.

ALSO READ | హాస్టల్ బాత్‎రూమ్‎లో విద్యార్థినుల నగ్న వీడియోల ఇష్యూ.. CMR కాలేజ్ ప్రిన్సిపాల్ ఏమన్నారంటే..?

ఈ ఉదంతంపై మేడ్చల్ ఏసీపీ శ్రీనివాస్ రెడ్డి ఏమన్నారంటే..

* CMR కాలేజ్లో ఘటనపై మాకు ఫిర్యాదు అందింది.
* హాస్టల్ గదిలోని ఒక బాత్ రూం వద్ద కిటికీలో నుంచి ఒక అగంతకుడు తొంగి చూశాడని ఫిర్యాదు అందింది.
* స్పాట్కి చేరుకుని కిటికీపై ఉన్న ఫింగర్ ప్రింట్స్ క్లూస్ సేకరించాం.
* మెస్లో పనిచేసే 5 మందిపై విద్యార్థినులు అనుమానం వ్యక్తం చేశారు.. వాళ్ళను అదుపులోకి తీసుకున్నాం.
* వాళ్ళ మొబైల్ ఫోన్స్ స్వాధీనం చేసుకుని వీడియోస్ చెక్ చేస్తున్నాం..
* రికార్డ్ చేసి ఉంటే.. చర్యలు తీసుకుంటాం.. మొత్తం 12 ఫోన్లు స్వాధీనం చేసుకున్నాం..
* హాస్టల్ పరిసరాలను పరిశీలించాం.. ఇద్దరు ఫింగర్ ప్రింట్స్ లభించాయి.
* మెస్లో పనిచేసే వ్యక్తులు మాత్రమే లోపలికి వచ్చే అవకాశం ఉంది.
* నిన్నటి(జనవరి 1 రాత్రి) నుంచి మా టెక్నికల్ టీం ఫోన్లని అనేక విధాలుగా పరిశీలించారు.
* వాటిలో ఎలాంటి వీడియోలు, ఫొటోలు లభించలేదు.
* ఒకవేళ డిలీట్ చేసి ఉంటారని ఫోన్లన్నీ ల్యాబ్కు పంపించాం.
* ఇప్పటివరకు అయితే ఎలాంటి వీడియోలు లభించలేదు.
* విద్యార్థులు భయాందోళనకు గురికావద్దు.
* ఈ ఘటనలో యాజమాన్యం నిర్లక్ష్యం స్పష్టంగా కనపడుతోంది.
* ఇప్పటివరకు యాజమాన్యం నుంచి ఎటువంటి ఫిర్యాదు రాలేదు.
* యాజమాన్యంతో మాట్లాడదామనుకుంటే అందుబాటులోకి రావడం లేదు.
* హాస్టల్ పరిసరాలు పరిశీలించిన తర్వాత విద్యార్థినుల భద్రతను యాజమాన్యం పట్టించుకోలేదనిపించింది.
* విద్యార్థినుల స్టేట్మెంట్ రికార్డు చేశాం.. అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నాం.
* ఇక్కడ విద్యార్థుల ఆందోళన చేస్తుంటే కనీసం భద్రత కావాలని కూడా పోలీసులను యాజమాన్యం అడగలేదు.
* దర్యాప్తులో భాగంగా యాజమాన్యంపై చర్యలు తీసుకుంటాం.