ఒంగోలులో జరుగుతున్న 'నవరత్నాలు - పేదలందరికీ ఇల్లు' కార్యక్రమంలో మాట్లాడుతూ సీఎం జగన్ టీడీపీ అధినేత చంద్రబాబుపై తీవ్రస్థాయిలో మండిపడ్డాడు. చంద్రబాబు రాజకీయ రాక్షసుడని, వంద సినిమా విలన్ల దుర్మార్గం కంటే చంద్రబాబు దుర్మార్గమే ఎక్కువని అన్నాడు. పేదలందరికీ మంచి జరుగుతుంటే చంద్రబాబులో అసూయ మొదలైందని అన్నారు. అమరావతిలో పేదలకు ఇల్లు ఇస్తుంటే కుల మతాల మధ్య సమతుల్యత దెబ్బతింటుందని కోర్టుకు వెళ్లాడని, ఎస్సి, ఎస్టీలుగా ఎవరైనా పుట్టాలని అనుకుంటారా అని దళితులను అవమానించాడని అన్నారు.
ఇన్ని కుట్రలు చేసి కూడా చంద్రబాబు బరితెగించి రాజకీయాల్లో కొనసాగుతున్నాడని అన్నారు. చంద్రబాబును సపోర్ట్ చేసేవాళ్ళు రాష్ట్రంలో లేరని, వాళ్లంతా రాష్ట్రం బయట ఉన్నవారే అని చెప్పుకొచ్చారు. సొంత సతీమణి కూడా చంద్రబాబు గెలుస్తాడని నమ్మటం లేదని, మనం సిద్ధం అంటుంటే, చంద్రబాబు కాకుండా ఆయన సతీమణి సిద్ధం అంటుందని అన్నారు.
స్వయానా ఆయన భార్యే కుప్పం నుండి బై బై బాబు అంటోందని ఎద్దేవా చేశారు. చంద్రబాబు ఇచ్చిన 650హామీల్లో 10శాతం కూడా అమలు చేయలేదని, అన్ని వర్గాల ప్రజలను చంద్రబాబు మోసం చేసి నిస్సిగ్గుగా మళ్లీ కొత్త మ్యానిఫెస్టోతో ప్రజల ముందుకు వస్తున్నారని అన్నారు. ఈ కార్యక్రమంలో పేదలకు ఇళ్ల పట్టాలు ఇచ్చిన సీఎం జగన్ పేదల అభివృద్దే ప్రభుత్వ లక్ష్యం అని స్పష్టం చేశాడు.