జగన్‌‌‌‌పై రాయితో దాడి..కంటికి గాయం

అమరావతి: ఏపీ సీఎం వైఎస్ జగన్​పై ఓ ఆగంతకుడు రాయితో దాడి చేశాడు. దాంతో ఆయన ఎడమ కనుబొమ్మపై భాగంలో గాయ మయ్యింది. బస్సు యాత్రలో భాగంగా జగన్ శనివారం.. విజయవాడ సెంట్రల్ నియోజకవర్గం సింగ్ నగర్ సెంటర్ వద్దకు చేరుకున్నారు. అక్కడ బస్సు పైనుంచి ప్రజలకు అభివాదం చేశారు. జనం పూలు జల్లుతూ ఆయనకు స్వాగతం పలికారు. అంతలో ఓ గుర్తుతెలియని వ్యక్తి పూలతో పాటుగా రాయిని కూడా  విసిరాడు. అది నేరుగా జగన్ ఎడమ కనుబొమ్మపై భాగంలో తగిలింది. ఈ ఘటనలో బస్సుపై ఉన్న వైసీపీ ఎమ్మెల్యే వెల్లంపల్లి శ్రీనివాస్ కు కూడా గాయమైంది. డాక్టర్లు వెంటనే ఇద్దరి గాయాలకు ఫస్ట్ ఎయిడ్ చేశారు. చికిత్స తర్వాత జగన్ మళ్లీ బస్సు యాత్ర కొనసాగించారు. సీఎం జగన్ కు వస్తున్న ప్రజాభిమానాన్ని ఓర్వలేక టీడీపీ వర్గాలే దాడికి తెగబడ్డారని విజయవాడ వైసీపీ నేతలు ఆరోపిస్తున్నారు.