కొండారెడ్డిపల్లికి సీఎం..  అంబురాన్నంటిన దసరా సంబురం

  • సీఎం హోదాలో మొదటిసారి సొంత ఊరుకి రేవంత్‌‌‌‌రెడ్డి
  • పలు అభివృద్ధి పనులకు ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు
  • దసరా ఉత్సవాలకు హాజరైన సీఎం

కొండారెడ్డిపల్లి (నాగర్‌‌‌‌కర్నూల్‌‌‌‌), వెలుగు : నాగర్‌‌‌‌కర్నూల్‌‌‌‌ జిల్లా వంగూరు మండలం కొండారెడ్డిపల్లిలో దసరా సంబురాలు అంబరాన్నంటాయి. దసరా పండుగకు సొంతూరికి వచ్చే ఆనవాయితీని సీఎం రేవంత్‌‌‌‌రెడ్డి ఈ సారి కూడా కొనసాగించారు. ప్రస్తుతం సీఎం హోదాలో మొదటిసారి గ్రామానికి వచ్చిన రేవంత్‌‌‌‌రెడ్డికి ప్రజాప్రతినిధులు, ఉన్నతాధికారులు ఘన స్వాగతం పలికారు. గ్రామస్తులు డప్పులు, కోలాటాలు, బతుకమ్మలతో రేవంత్‌‌‌‌రెడ్డిని ఆహ్వానించారు. ఎంపీ మల్లు రవి, ఎమ్మెల్యేలు డాక్టర్‌‌‌‌ వంశీకృష్ణ, కసిరెడ్డి నారాయణరెడ్డి, కూచుకుళ్ల రాజేశ్‌‌‌‌రెడ్డి, వాకిట శ్రీహరి, మాజీ జడ్పీటీసీ కేవీఎన్‌‌‌‌ రెడ్డితో కలిసి ఓపెన్‌‌‌‌ టాప్‌‌‌‌ జీప్‌‌‌‌లో ప్రయాణిస్తూ ప్రజలకు అభివాదం చేశారు. హనుమాన్‌‌‌‌ ఆలయానికి వచ్చిన సీఎంకు పూజారులు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. సాయంత్రం సీఎం రేవంత్‌‌‌‌రెడ్డి గ్రామ శివారులోని జమ్మి చెట్టు దగ్గరికి చేరుకొని మనుమడితో కలిసి జమ్మికి ప్రత్యేక పూజలు చేసి, ప్రజలకు దసరా శుభాకాంక్షలు తెలిపారు. సీఎం పర్యటన నేపథ్యంలో పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. కలెక్టర్‌‌‌‌ బాదావత్‌‌‌‌ సంతోష్‌, ఐజీ సత్యనారాయణ, డీఐజీ చౌహన్, ఎస్పీ గైక్వాడ్‌‌‌‌ ఉన్నారు.

అభివృద్ధి పనులను ప్రారంభించిన సీఎం

కొండారెడ్డిపల్లిలో రూ.45 లక్షలతో నిర్మించిన పశు వైద్యశాల, రూ.58 లక్షలతో కట్టిన బీసీ కమ్యూనిటీ హాల్‌‌‌‌ను సీఎం రేవంత్‌‌‌‌రెడ్డి ప్రారంభించారు. అలాగే యాదయ్య స్మారక గ్రంథాలయ భవనం, గ్రామ పంచాయతీ బిల్డింగ్‌‌‌‌ను ప్రారంభించారు. కమ్యూనిటీ బిల్డింగ్‌‌‌‌కు శంకుస్థాపన చేయడంతో పాటు గ్రామంలో భూగర్భ మురుగు నీటి పైప్‌‌‌‌లైన్‌‌‌‌ నిర్మాణం, మురుగు నీటి శుద్ధి కేంద్రం, అంతర్గత సీసీ రోడ్ల నిర్మాణం, బస్టాండ్‌, మెయిన్‌ రోడ్‌పై సెంట్రల్‌‌‌‌ హైమాస్ట్‌‌‌‌ లైట్ల పనులు, రూ.32 లక్షలతో నిర్మించే పిల్లల పార్క్‌‌‌‌, ఓపెన్‌‌‌‌ జిమ్‌‌‌‌ పనులకు శంకుస్థాపన చేశారు.

కొడంగల్‌లో...

కొడంగల్, వెలుగు : కొడంగల్‌లో నిర్వహించిన దసరా వేడుకలకు సీఎం రేవంత్‌రెడ్డి హాజరయ్యారు. శనివారం రాత్రి హైదరాబాద్‌ నుంచి కొడంగల్​వచ్చిన ఆయన ఇక్కడే బస చేశారు. ఆదివారం ఉదయం నుంచి కాంగ్రెస్‌ నాయకులు, పార్టీ లీడర్లతో కలిసి దసరా సంబరాలు జరుపుకున్నారు. స్టేట్​పోలీస్​హౌసింగ్​కార్పొరేషన్​చైర్మన్​గుర్నాథ్‌రెడ్డి, కలెక్టర్‌ ప్రతీక్​జైన్, ఎస్పీ నారాయణరెడ్డితో కలిసి కొడంగల్​అభివృద్ధిపై సమీక్షించారు. పరిగి ఎమ్మెల్యే రాంమోహన్‌ రెడ్డి, తాండూర్ ఎమ్మెల్యే మనోహర్‌రెడ్డి సీఎంను కలిసి పండుగ శుభాకాంక్షలు తెలిపారు.