ఇంటికెళ్లాక వాళ్ల మామ చేతుల్లో హరీశ్కు కొరడా దెబ్బలు తప్పవ్ : సీఎం రేవంత్

అసెంబ్లీలో బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీశ్ రావుపై సీఎం రేవంత్ రెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఇంటికెళ్లాక హరీశ్ ను వాళ్ల మామ కొరడాతో కొడతారని అన్నారు. ఓఆర్ఆర్ పై విచారణ..ఫార్ములా ఈ రేసింగ్ వ్యవహారంలో. విచారణ కోరి నువ్వే కేటీఆర్ ను ఇరికించావని హరీష్ కు కొరడా దెబ్బలు పడతాయి.. ఇంటిదగ్గర హరీష్ కు కొరడా దెబ్బలు కామనే. హరీష్ తన నిజాయితీ నిరూపించుకోవడానికి అప్పుడప్పుడు ఇలాంటి చొక్కాలు చించుకునే పని చేస్తుంటారని రేవంత్ అన్నారు. అసెంబ్లీలో మార్షల్స్ ను తోసుకుంటూ హరీశ్ స్పీకర్ పోడియం దగ్గరకు దూసుకెళ్లిన సంగతి తెలిసిందే..

 భూ భారతి బిల్లుపై చర్చ సందర్భంగా మాట్లాడిన సీఎం రేవంత్ .. సభలో గందరగోళ పరిస్థితులు ఉన్నపుడు కమ్యూనిస్టులు, ఎంఐఎం సభ్యులు సమన్వయం చేస్తుంటారు.. గతంలో టీడీపీ ఉన్నపుడు.. రాజశేఖర్ రెడ్డి సీఎంగా ఉన్నపుడు కూడా సమన్వయం చేసేవారు. కీలకమైన సలహాలు, సూచనలు చేస్తుంటారు. కానీ ఇవాళ వారు చెప్పినా కూడా వినడం లేదు. సభను అడ్డుకోవడమే లక్ష్యంగా పెట్టుకున్నారు. ఇలా చేసినందుకే అసెంబ్లీ ఎన్నికల్లో ఓడారు.. పార్లమెంటులో ఓడారు..తర్వాత హైదరాబాద్ కోల్పోయారు.. కొన్నాళ్లుంటే మెదక్ కూడా కోల్పోయే పరిస్థితి వస్తదేమో అని రేవంత్ విమర్శించారు.