ఎవడైనా ప్రభుత్వాన్ని టచ్ చేస్తే అంతు చూస్తా: సీఎం రేవంత్ రెడ్డి

ప్రభుత్వాన్ని ఎవరైనే టచ్ చేస్తే  వాళ్ల అంతుచూస్తానన్నారు సీఎం రేవంత్ రెడ్డి. పాలమూరు ప్రజాదీవెన సభలో మాట్లాడిన రేవంత్.. మరో పదేళ్లు తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలో ఉంటదని చెప్పారు. మోదీ పదేళ్లు..కేసీఆర్ అధికారంలో ఉండొచ్చు కానీ.. పాలమూరు బిడ్డ సీఎం కుర్చీలో కూర్చోవద్దా అని ప్రశ్నించారు. ప్రభుత్వాన్ని ఎందుకు పడగొడ్తారని ప్రశ్నించారు రేవంత్.  తనకు వయుసుంది..ఓపికా ఉంది..తోకజాడిస్తే  కత్తరె కూడా ఉందని ఘాటుగా స్పందించారు రేవంత్. పాలమూరు అసూయతోనే కేసీఆర్ మాట్లాడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.పగలైనా రాత్రైనా జోష్ తో పనిచేస్తానని చెప్పారు.

రాష్ట్రానికి సహకరించకుంటే మోదీనైనా..కేడీనైనా ఢీ కొడ్తానని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. తెలంగాణకు నిధులివ్వకుంటే బీజేపీని చీల్చి చెండాడుతానని మండిపడ్డారు. బీఆర్ఎస్ అంటే బిల్లా రంగా సమితి..కేటీఆర్ ,హరీశ్ రావును చూస్తుంటే బిల్లారంగాల కనిపిస్తారని ఎద్దేవా చేశారు. పదేళ్లు బీఆర్ఎస్ నేతలు రాష్ట్రాన్ని పందికొక్కుల్లా దోచుకుతిన్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.   పాలమూరు కోసం బీఆర్ఎస్  చేసిందేమి లేదన్నారు.  కుర్చేసుకుని.. కాదు కేసీఆర్  మందేసుకుని ఫామ్ హౌస్ లో పండుకున్నాడని మండిపడ్డారు. చాపల  పులుసు తిని  ఏపీకి నీళ్లు దారాత్తం చేశారని ఆరోపించారు. 

ALSO READ :- మెయిన్ రోడ్డుపై గ్యాస్ పైప్ లైన్ లీక్.. భారీగా ట్రాఫిక్ జాం

పాలమూరులో రెండు ఎంపీ సీట్లను గెలిపించాలని పిలుపునిచ్చారు రేవంత్ రెడ్డి. రాష్ట్రంలో 14 ఎంపీ సీట్లు గెలిచి రాహుల్ గాంధీ ప్రధాని కావడానికి కృషి చేయాలన్నారు. మహబూబ్ నగర్ ఎమ్మెల్సీ అభ్యర్థిగా జీవన్ రెడ్డిని గెలిపించాలని కోరారు.