జీవన్ రెడ్డికి బీ ఫారం అందజేసిన సీఎం

పాలమూరు, వెలుగు: మహబూబ్ నగర్  స్థానిక సంస్థల కాంగ్రెస్  ఎమ్మెల్సీ అభ్యర్థి మన్నె జీవన్ రెడ్డికి ఆదివారం సీఎం రేవంత్ రెడ్డి బీ ఫారం అందించారు. బాబాయ్​ ఎంఎస్ఎన్  అధినేత మన్నె సత్యనారాయణ రెడ్డితో కలిసి  బీ ఫారం అందుకొని సీఎంకు కృతజ్ఞతలు తెలిపారు. 

సీఎం,  మంత్రి జూపల్లి కృష్ణారావు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ప్రజా ప్రతినిధులు, స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులతో పాటు పార్టీ నాయకుల సహకారంతో విజయం సాధిస్తామని ధీమా వ్యక్తం చేశారు. ఉమ్మడి జిల్లాను అభివృద్ధి చేసేందుకు తనకు అవకాశం కల్పించాలని కోరారు .గత ప్రభుత్వ హయాంలో స్థానిక సంస్థల ప్రజా ప్రతినిధులు తీవ్ర అన్యాయానికి గురయ్యారని, చేసిన పనులకు బిల్లులు రాక ఆర్థికంగా ఇబ్బంది పడుతున్నారని చెప్పారు. పార్టీలకు అతీతంగా తనను ఎమ్మెల్సీగా గెలిపించాలని కోరారు.