నో బెన్ఫిట్ షోలు -టికెట్ల రేట్ల పెంపు...కుండబద్దలు కొట్టిన సీఎం రేవంత్

  •  అసెంబ్లీలో చెప్పిన మాటకే కట్టుబడి ఉన్నానని వ్యాఖ్య
  • బౌన్సర్లపై సీరియస్‌గా ఉంటామని వెల్లడి
  •  శాంతిభద్రతల విషయంలో రాజీ ఉండదు
  • ఫ్యాన్స్ కంట్రోల్ బాధ్యత సెలబ్రిటీలదే
  • సినీ ఇండస్ట్రీకి అండగా ప్రభుత్వం
  • డ్రగ్స్‌, ఉమెన్ సేఫ్టీ క్యాంపెయిన్‌ చేయాలి
  • సినీ పెద్దలతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి
  • ఇఫీని హైదరాబాద్ లో నిర్వహించండి: రాఘవేందర్ రావు
  • హైదరాబాద్‌ వరల్డ్ సినిమా కేపిటల్ కావాలి: నాగార్జున
  • చిన్న చిన్న విషయాలు పట్టించుకోవద్దు: శ్యాంప్రసాద్ రెడ్డి
  • ఎలక్షన్‌ రిజల్ట్‌ లాగే సినిమా రిలీజ్‌ ఫస్ట్‌డే: మురళీ మోహన్


ఇకపై రిలీజయ్యే సినిమాలకు బెన్ఫిట్ షోలు ఉండవని సీఎం రేవంత్ రెడ్డి  చెప్పారు. సినిమా టికెట్ల రేట్ల పెంపు కూడా ఉండబోదని స్పష్టం చేశారు. తాను అసెంబ్లీలో చెప్పిన మాటకు కట్టుబడే ఉన్నానని చెప్పారు. శాంతి భద్రతల విషయంలో రాజీ ఉండబోదని తేల్చి చెప్పారు. ఇవాళ కమాండ్ కంట్రోల్ సెంటర్ లో సీఎం రేవంత్ రెడ్డితో సినీ నిర్మాతలు, దర్శకులు, ముఖ్యులతో సమావేశమయ్యారు. ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, ఎఫ్డీసీ చైర్మన్ దిల్ రాజు సమక్షలో జరిగిన ఈ సమావేశంలో సీఎం క్లారిటీ ఇచ్చారు. సినీ పరిశ్రమకు ప్రభుత్వం పూర్తిగా అండగా ఉంటుందని చెబుతూనే.. ఇకపై బౌన్సర్ల విషయంలోనూ కఠినంగా ఉంటామని సీఎం తెలిపారు. సంధ్య థియేరట్ లో చోటు చేసుకున్న ఘటనపై సీఎం ఆవేదన వ్యక్తం చేశారు. ఒక మహిళ ప్రాణాలు  కోల్పోవడం వల్లే తమ ప్రబుత్వం ఈ వ్యవాహరాన్ని సీరియస్ గా తీసుకుందని చెప్పారు. ఇకప ఫ్యాన్స్ ను కంట్రోల్ చేసుకోవాల్సిన బాధ్యత సెలబ్రిటీలదేనని అన్నారు.  డ్రగ్స్ కు వ్యతిరేకంగా, మహిళా భద్రతపై క్యాంపెయిన్ చేయాలని సూచించారు. తెలంగాణ రైజింగ్‌లో ఇండస్ట్రీ సోషల్‌ రెస్పాన్స్‌బిలిటీతో వ్యవహరించాలని సూచించారు.  టెంపుల్‌ టూరిజం, ఎకో టూరిజాన్ని సినీ పరిశ్రమ ప్రమోట్ చేయాలన్నారు.  

ఇండస్ట్రీకి వ్యతిరేకం కాదు 

“మేం సినిమా ఇండస్ట్రీకి వ్యతిరేకం కాదు.. టాలీవుడ్‌ సమస్యల పరిష్కారానికి మేం ముందుంటాం.. తెలంగాణలో షూటింగ్‌లకు మరిన్ని రాయితీలు కల్పించాలన్న విజ్ఞప్తిపై కమిటీ వేస్తాం. ముందస్తు అనుమతులు, తగిన బందోబస్తు ఉంటేనే సినిమా ఈవెంట్లకు అనుమతి ఉంటుంది. ఇకపై బెన్‌ఫిట్ షోలు ఉండవు.. టికెట్ రేట్ల పెంపు కూడా ఉండదు. అసెంబ్లీలో చెప్పిన మాటకు కట్టుబడి ఉన్నాం’ 

ఇఫీని హైదరాబాద్ లో నిర్వహించండి 
రాఘవేంద్రరావు, దర్శకుడు

‘అందరు సీఎంలు ఇండస్ట్రీని బాగా చూసుకున్నారు. ఈ ప్రభుత్వం కూడా బాగా చూసుకుంటుంది. దిల్ రాజును ఎఫ్డీసీ చైర్మన్ చేయడాన్ని స్వాగతిస్తున్నం. తెలంగాణలో అద్భుతమైన టూరిస్ట్ స్పాట్ లు. గతంలో చంద్రబాబు చిల్డ్రన్స్‌ ఫిల్మ్‌ ఫెస్టివల్‌ హైదరాబాద్‌లో చేశారు. ఇప్పుడు కూడా ఇంటర్నేషనల్‌ ఫిల్మ్ ఫెస్టివల్‌ను హైదరాబాద్‌లో నిర్వహించాలని కోరుతున్నాం 

ALSO READ | పుష్ప-2 వివాదాల ఎఫెక్ట్.. సినిమాలకు సుకుమార్ గుడ్ బై..?

వరల్డ్ కేపిటల్ కావాలి: నాగార్జున, సినీ హీరో

సినీ పరిశ్రమ గ్లోబల్ స్థాయికి ఎదుగుతుంది. యూనివర్సల్‌ లెవెల్‌లో స్టూడియో సెటప్‌ ఉండాలి. హైదరాబాద్‌ వరల్డ్ సినిమా కేపిటల్ కావాలనేది మా కోరిక. ప్రభుత్వం కేపిటల్ ఇన్సెంటివ్‌లు ఇస్తేనే బాగుంటుంది.  
 
చిన్న విషయాలు పట్టించుకోవద్దు: శ్యాంప్రసాద్‌ రెడ్డి, నిర్మాత

‘నేను చిన్నప్పటి నుంచి ఇండస్ట్రీని చూస్తున్నాను. హైదరాబాద్  ను నెక్స్ట్ లెవల్ లోకి తీసుకెళ్లాలి. చిన్న చిన్న విషయాలు  పట్టించుకోకుండా ఉంటే మంచిదని నా విన్నప్పం.

ఎలక్షన్ రిలీజ్ లాగే సినిమా ఫస్ట్ డే: మురళీ మోహన్

‘ఎలక్షన్‌ రిజల్ట్‌ లాగే సినిమా రిలీజ్‌ ఫస్ట్‌డే ఉంటుంది. సంధ్య థియేటర్ ఘటన మమ్మల్ని బాధించింది. సినిమా రిలీజ్‌లో కాంపిటిషన్ వల్లే ప్రమోషన్ కీలకంగా మారింది. ప్రపంచ వ్యాప్తంగా సినిమా రిలీజ్‌ ఉండడం వల్ల ప్రమోషన్‌ను విస్తృతంగా చేస్తున్నాం.

ఇంటర్నేషనల్ ఫిల్మ్ డిస్టినేషన్ మా డ్రీమ్: దగ్గుబాటి  సురేశ్ బాబు, నిర్మాత

హైదరాబాద్ ను ఇంటర్నేషనల్‌ ఫిల్మ్‌ డెస్టినేషన్‌ చేయాలనేది డ్రీమ్. ప్రభుత్వ సాయంతోనే మర్రిచెన్నారెడ్డి, అక్కినేని చొరవ వల్ల ఆ రోజుల్లో చెన్నై నుంచి ఇండస్ట్రీ హైదరాబాద్‌కి వచ్చింది.  నెట్‌ఫ్లిక్స్‌, అమెజాన్‌ సహా అన్ని ఏజెన్సీలకు హైదరాబాద్‌ కేరాఫ్‌గా ఉండాలి.  

షూటింగ్ డెస్టినేషన్ కోసం సహకరిస్తం: అల్లు అరవింద్

హైదరాబాద్ ప్రపంచ షూటింగ్ డెస్టినేషన్ కావడానికి ప్రభుత్వానికి సహకరిస్తం.. ప్రభుత్వాన్ని కలిసే అవకాశం వచ్చినందుకు ధన్యవాదాలు. సంధ్యథియేటర్ లాంటి ఘటనలు పునరావృతం కావద్దని కోరుకుంటున్నం. 

భేటీకి 50 మంది ప్రముఖులు

ముఖ్యమంత్రితో కమాండ్ కంట్రోల్ సెంటర్ లో నిర్వహించిన భేటీకి 50 మంది సినీ ప్రముఖులు హాజరయ్యారు. 21 మంది నిర్మాతలు, 13 మంది దర్శకులు, 11 మంది నటులు ఉన్నారు. నిర్మాతల్లో అల్లు అరవింద్‌, సురేశ్‌ బాబు, కె ఎల్‌ నారాయణ, దామోదర్‌, బీవీఎస్‌ఎన్‌ ప్రసాద్‌, చినబాబు, దానయ్య, కిరణ్‌, రవి, స్రవంతి రవి కిషోర్‌, నాగబాబు, టీజీ విశ్వప్రసాద్‌, ప్రసన్న, యూవీ వంశీ, సుధాకర్‌ రెడ్డి, నాగవంశీ, సునీల్‌ - అనుపమ, గోపీ ఆచంట, సి.కల్యాణ్‌, రమేశ్‌ ప్రసాద్‌, భరత్‌ భూషణ్‌ ఉన్నారు. దర్శకుల్లో రాఘవేంద్రరావు, కొరటాల శివ, త్రివిక్రమ్‌, అనిల్‌ రావిపూడి, ప్రశాంత్‌ వర్మ, సాయి రాజేశ్‌, వంశీ పైడిపల్లి, హరీశ్‌ శంకర్‌, వీర శంకర్‌, బాబీ, వేణు శ్రీరామ్‌, వేణు యెల్దండి, విజయేంద్రప్రసాద్‌తోపాటు నటులు నాగార్జున, వెంకటేశ్‌, వరుణ్‌ తేజ్‌, సాయిధరమ్‌ తేజ్‌, కల్యాణ్‌ రామ్‌, శివ బాలాజీ, అడివి శేష్‌, నితిన్‌, కిరణ్‌ అబ్బవరం, సిద్ధూ జొన్నలగడ్డ, రామ్‌ పోతినేని ఈ సమాశానికి హాజరయ్యారు. 

మెగా ఫ్యామిలీ నుంచి ఇద్దరు

మెగాస్టార్ చిరంజీవి ఫ్యామిలీ నుంచి ముఖ్యులెవరూ ఈ చర్చలకు రాకపోవడం గమనార్హం. చిరంజీవి గానీ, నాగేంద్రబాబు హాజరు కాలేదు. అయితే నాగబాబు కుమారుడు వరుణ్ తేజ్, చిరంజీవి మేనల్లుడు సాయిధరమ్ తేజ్ మాత్రమే హాజరయ్యారు. 

బెనిఫిట్ షో, రేట్లు చిన్న అంశం: దిల్ రాజు

సినిమా టికెట్ రేట్ల పెంపు, బెనిఫిట్ షోలు అనేది చాలా చిన్న అంశం.  హైదరాబాద్ లో ఇతర భాషల షూటింగ్ లు జరుగు తున్నాయి. ఇపుడు వరల్డ్ హాలీవుడ్ సినిమా షూటింగ్ లు జరగాలని సీఎం అన్నారు. 15 రోజుల్లో మీటింగ్ ఏర్పాటు చేసుకొని సీఎం కి రిపోర్ట్ ఇస్తాం.