రాములోరి పెండ్లిలో సీఎం రేవంత్ రెడ్డి కుటుంబం

వంగూరు, వెలుగు: సీఎం సొంత గ్రామం నాగర్​కర్నూల్​జిల్లా వంగూరు మండలం కొండారెడ్డిపల్లిలో జరిగిన  సీతారాముల కల్యాణోత్సవంలో సీఎం భార్య గీతారెడ్డి, బిడ్డ నైమిష, సీఎం సోదరులు, కుటుంబసభ్యులు పాల్గొన్నారు. సీఎం సొంత ఊరు కొండారెడ్డిపల్లిలోని ఆంజనేయ స్వామి ఆలయంలో ప్రతి ఏడాది నిర్వహించే ఉత్సవాల్లో రేవంత్  రెడ్డి కుటుంబ సభ్యులు పాల్గొనడం ఆనవాయితీగా వస్తోంది. బుధవారం నిర్వహించిన శ్రీ సీతారాముల కల్యాణోత్సవంలో సీఎం భార్య, బిడ్డ పాల్గొని పట్టువస్త్రాలు సమర్పించారు. సీఎం సోదరులు తిరుపతి రెడ్డి, కొండల్ రెడ్డి, కృష్ణారెడ్డి కుటుంబసభ్యులతో కలిసి హాజరయ్యారు. కల్యాణంలో పాల్గొన్న గ్రామస్తులను ఆప్యాయంగా పలకరించారు. వంగూరు జడ్పీటీసీ కేవీఎన్ రెడ్డి పాల్గొన్నారు.