ఇవాళ(జనవరి3) నుమాయిష్ ప్రారంభించనున్న సీఎం రేవంత్​రెడ్డి

బషీర్ బాగ్, వెలుగు: అఖిల భారత పారిశ్రామిక ప్రదర్శన–84 (నుమాయిష్)ను సీఎం రేవంత్ రెడ్డి శుక్రవారం ప్రారంభించనున్నారు. నుమాయిష్ ను జనవరి 1నే ప్రారంభించాలి. కానీ, మాజీ ప్రధాని డా.మన్మోహన్ సింగ్ సంతాప దినాల కారణంగా జనవరి 3న ప్రారంభించనున్నారు. 

ఈ ఏడాది నుమాయిష్ లో రెండు వేల స్టాల్స్ ను ఎగ్జిబిషన్ సొసైటీ ఏర్పాటు చేయనుంది. మినీ ట్రైన్ తో పాటు డబుల్ డెక్కర్ బస్సు సందర్శకులకు ప్రత్యేక ఆకర్షణగా నిలవనుంది. నుమాయిష్ ప్రతి రోజు సాయంత్రం 4 గంటల నుంచి రాత్రి పదిన్నర వరకు, వారాంతాలు, సెలవు రోజుల్లో రాత్రి పదకొండు గంటల వరకు కొనసాగుతుంది. ఇక నుమాయిష్ ప్రవేశ రుసుముగా రూ.50  నిర్ణయించారు.