ఏప్రిల్ 19న పాలమూరుకు సీఎం రేవంత్​రెడ్డి

పాలమూరు, వెలుగు: మహబూబ్​నగర్​ ఎంపీ క్యాండిడేట్​ వంశీచంద్​రెడ్డి ఈ నెల 19న నామినేషన్​ వేయనుండగా, ఈ కార్యక్రమానికి సీఎం రేవంత్​రెడ్డి హాజరు కానున్నట్లు దేవరకద్ర ఎమ్మెల్యే జి మధుసూదన్ రెడ్డి తెలిపారు. జిల్లా కేంద్రంలోని కాంగ్రెస్  పార్టీ ఆఫీస్​లో మంగళవారం మీడియాతో మాట్లాడారు. మెట్టుగడ్డ నుంచి ర్యాలీగా వెళ్లి నామినేషన్  దాఖలు చేయడం జరుగుతుందని, అనంతరం తెలంగాణ చౌరస్తాలో జరిగే కార్నర్  మీటింగ్​లో సీఎం ప్రసంగిస్తారని తెలిపారు. పార్లమెంట్  పరిధిలోని ఎమ్మెల్యేలు పాల్గొంటారని, కాంగ్రెస్  నాయకులు, కార్యకర్తలు హాజరు కావాలని కోరారు. టీపీసీసీ అధికార ప్రతినిధి హర్షవర్ధన్ రెడ్డి, నాయకులు సిరాజ్ ఖాద్రి, సీజే బెనహర్, సాయిదాస్  పాల్గొన్నారు.

సక్సెస్​ చేయాలి..

మక్తల్: కాంగ్రెస్​ ఎంపీ క్యాండిడేట్​ నామినేషన్​ కార్యక్రమానికి నియోజకవర్గం నుంచి పార్టీ శ్రేణులు భారీగా తరలివచ్చి సక్సెస్​ చేయాలని ఎమ్మెల్లే వాకిటి శ్రీహరి కోరారు. పట్టణంలో మీడియాతో మాట్లాడుతూ ఈ నెల 19న నామినేషన్​ కార్యక్రమానికి సీఎం హాజరవుతారని చెప్పారు. వచ్చే ఎన్నికల్లో నియోజకవర్గం నుంచి భారీ మెజార్టీ అందించాలని కోరారు. రాజప్పగౌడ, రవికుమార్, నూరుద్దీన్, గడ్డం రమేశ్, వెంకటేశ్, కల్లూరి గోవర్ధన్, రాహుల్  పాల్గొన్నారు. అనంతరం బీజేపీకి చెందిన గడ్డం రమేశ్  కాంగ్రెస్  పార్టీ లో చేరారు.