పేటలో నర్సింగ్ కాలేజీ ప్రారంభం

నారాయణపేట, వెలుగు: నారాయణపేట జిల్లాకు మంజూరైన నర్సింగ్  కాలేజీని సీఎం రేవంత్ రెడ్డి సోమవారం వర్చువల్ గా ప్రారంభించారు. ప్రజాపాలన విజయోత్సవాల్లో భాగంగా సోమవారం హైదరాబాద్  ఎన్టీఆర్  మార్గ్ లోని హెచ్ఎండీఏ గ్రౌండ్స్ లో జరిగిన ఆరోగ్య ఉత్సవాల్లో భాగంగా వైద్యారోగ్య శాఖకు సంబంధించిన అభివృద్ధి కార్యక్రమాలను అక్కడి నుంచే ప్రారంభించారు. 

ఆరోగ్య ఉత్సవాలను ప్రత్యక్ష ప్రసారం ద్వారా వీక్షించేందుకు నారాయణపేట మండలం అప్పక్ పల్లిలోని మెడికల్  కాలేజీ సమావేశ మందిరం వేదికైంది. అడిషనల్​ కలెక్టర్  బేన్ షాలం, మెడికల్  కాలేజీ ప్రిన్సిపాల్  రాంకిషన్, డీఎంహెచ్​వో సౌభాగ్య లక్ష్మి పాల్గొన్నారు.