డిసెంబర్ 14న చేవెళ్ల, పరిగి, షేక్​పేట గురుకులాలకు సీఎం రేవంత్​ రెడ్డి

  • మధిర, బోనకల్​లో డిప్యూటీ సీఎం భట్టి పర్యటన
  • అదే బాటలో రాష్ట్ర వ్యాప్తంగా మంత్రులు, సీఎస్, అధికారులు

హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలోని సంక్షేమ హాస్టళ్లు, గురుకులాల్లో పరిస్థితులను స్వయంగా అంచనా వేయడానికి సీఎం రేవంత్ రెడ్డి, మంత్రులు, సీఎస్, ఐఏఎస్ లు, ఐపీఎస్ లు గురుకుల బాట పట్టనున్నారు. శనివారం రాష్ట్ర వ్యాప్తంగా గురుకులాల్లో పర్యటించి అక్కడి పరిస్థితులు తెలుసుకొని స్టూడెంట్స్ తో కలిసి లంచ్ చేయనున్నారు. మంత్రుల షెడ్యూల్ ను సీఎస్ శాంతి కుమారి శుక్రవారం మీడియాకు విడుదల చేశారు. సీఎం రేవంత్ రెడ్డి ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలోని చేవేళ్ల, పరిగి, షేక్ పేట ఎస్సీ గురుకులాల్లో పర్యటిస్తున్నట్లు సెక్రటరీ అలుగు వర్షిణి మీడియాకు తెలిపారు. 

డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క తన సొంత నియోజకవర్గమైన మధిరతో పాటు బోనకల్ లో పర్యటించనున్నారు. 8 ఏండ్ల తరువాత రాష్ట్రంలోని ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ గురుకుల హాస్టళ్లలోని దాదాపు 8 లక్షల మంది విద్యార్థులకు ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం డైట్ చార్జీలను 40 శాతం పెంచగా, 16 ఏండ్ల తర్వాత కాస్మోటిక్ చార్జీలను 200 శాతం పెంచింది. 

 దీంతో పాటు  రాష్ట్రంలోని పాఠశాలలో రూ. 667.25 కోట్లతో మౌలిక సదుపాయాలను కూడా ప్రభుత్వం కల్పించింది. హాస్టల్ల పనితీరును నిరంతరం పర్యేవేక్షించేందుకు ఆకునూరి మురళి అధ్యక్షతన స్టేట్ ఎడ్యుకేషన్ కమిషన్ కూడా ఏర్పాటు చేసింది. ఈ కమిషన్ చైర్మన్, మెంబర్లు కొద్ది రోజులుగా జిల్లాల్లో పర్యటిస్తూ స్టూడెంట్స్ తో ఇంటరాక్ట్ అవుతూ పరిస్థితులను తెలుసుకుంటున్నారు.

మంత్రులు పర్యటించనున్న గురుకులాలు

  • దామోదర రాజనర్సింహ:    బీసీ గురుకుల కాలేజ్ , భూపాలపల్లి జిల్లా మైలారం
  • శ్రీధర్ బాబు:     బీసీ గురుకుల కాలేజ్ , భూపాలపల్లి జిల్లా మైలారం
  • పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి:     ఖమ్మం జిల్లా మాదిరిపురం ఎస్టీ గురుకుల కాలేజ్
  • పొన్నం ప్రభాకర్:    ఎస్సీ గురుకుల కాలేజ్, షేక్ పేట, జూబ్లిహిల్స్
  • కొండా సురేఖ:    ఎస్సీ గురుకుల హత్నూర, సంగారెడ్డి
  • ధనసరి సీతక్క:     ఆశ్రమ ఉన్నత పాఠశాల (బాలికలు), నేరడిగొండ, ఆదిలాబాద్
  • తుమ్మల నాగేశ్వరరావు:    ఏకలవ్య మోడల్, గండుగులపల్లి, భద్రాద్రి కొత్తగూడం
  • జూపల్లి కృష్ణారావు:    ఎస్సీ గురుకులం, కొల్లాపూర్, నాగర్ కర్నూల్