దొరల గడీలను కూలుస్తానని చెప్పి.. దొరతో చేతులు కలిపాడు: సీఎం రేవంత్

నాగర్ కర్నూల్ బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ పై సీఎం రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. దొరల గడీలను కూలుస్తానని రాజకీయాల్లోకి వచ్చిన ఆర్ఎస్సీకి.. ఆరు నెలల్లోనే ఆ దొర ఎందుకు మంచొడయ్యాడని ప్రశ్నించారు సీఎం.  బిజినేపల్లి కాంగ్రెస్ జనజాతర సభలో సీఎం రేవంత్ మాట్లాడుతూ.. " డీకే అరుణ, ఆర్ఎస్పీతో నాకు శతృత్వం లేదని... జెండాలు పక్కన పెడదాం.. అభివృద్ధికి కలిసిరండి" అన్నారు. దొంగలకు సద్దిమూటలు మోసే నేతలు ఇక్కడున్నారన్నారు. అలంపూర్ వరద బాధితులను కేసీఆర్ ఆదుకున్నారా?..  డబుల్ బెడ్రూం ఇండ్లు కట్టిందెక్కడ? అని ప్రశ్నించారు.

Also Read:రామగుండంలో బీఆర్ఎస్కు షాక్ .. కాంగ్రెస్ లోకి మాజీ మేయర్

సీఎం రేవంత్ రెడ్డి పాయింట్స్

  • ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ అంటే నాకు గౌరవం
  • టీఎస్పీఎస్సీ చైర్మన్ పదవికి కూడా ఆర్ఎస్పీకి ఆఫర్ చేశాం
  • సర్వీసులోనే ఉంటే ఇవాళ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ డీజీపీ అయ్యేవాడు. 
  • అట్టడుగు వర్గాల వారు ఆ స్థాయిలో ఉంటేనే న్యాయం జరుగుతుంది.
  • వర్గీకరణకు వ్యతిరేకంగా కేసీఆర్ పదేండ్లు పనిచేశాడు
  • అలాంటి వ్యక్తితో ఎలా చేతులు కలిపాడు.
  •  ప్రజలు ఛీ కొట్టిన కేసీఆర్ ను భుజాలపై వేసుకొని తీరుగుతున్నాడు
  • ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ కు ఓటు వేస్తే కేసీఆర్ కు వేసినట్లే.
  • సంగం బండను పగలగొట్టేందుకు 40 ఏండ్లు పట్టింది.
  • పాలమూరు ప్రజలకు బంగారం లాంటి అవకాశం వచ్చింది.
  • ఎంపీగా మల్లు రవిని గెలిపించండి
  • ఎన్ని వేల కోట్ల రూపాయలైనా.. ఈ జిల్లాకు నీళ్లిచ్చే బాధ్యత నాది.
  • వాల్మీకి బోయలను ఎస్టీ జాబితాలో చేర్చే బాధ్యత నాది